Producer Adhisheshagiri rao : కృష్ణ గారి పార్ధివ దేహాం అందరు వదిలి వెళ్ళడానికి గల కారణాలు…. గచ్చిబౌలి స్టేడియం లో కృష్ణ గారిని ఎందుకు పెట్టలేదంటే….: ప్రొడ్యూసర్ అధిశేషగిరి రావు

0
44

Producer Adhisheshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అధిశేషగిరి రావు గారు. అన్న కృష్ణ గారిజి తోడుగా ప్రతి విషయంలోనూ ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. పద్మాలయా స్టూడియోస్ కట్టాక ఆ స్టూడియో బాధ్యతలను ఆయనే చూసుకుంటూ కృష్ణ గారి ఓన్ ప్రొడక్షన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. నటనలో కృష్ణ గారు నిర్మాణ రంగంలో అధిశేష గిరి రావు గారు అలాగే ప్రొడక్షన్ లో హనుమంత రావు గారు ఇలా ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలో ఉండేవారు. ఇక కృష్ణ గారి కుటుంబంలో గతేడాది వరుసగా ముగ్గురు మరణించారు. రమేష్ బాబు గారు మరణించిన కొద్ది నెలలకు ఇందిర గారు ఆ తరువాత కృష్ణ గారు మరణించారు. అలా వరుస విషాదాల తరువాత మొదటి సారి ఇంటర్వ్యూ లో మాట్లాడారు అధిశేషగిరి రావు గారు. కృష్ణ మరణం తరువాత జరిగిన సంఘటనలను వివరించారు.

కృష్ణ గారి పార్ధివ దేహం వద్ద ఎవరు లేరన్నది అపద్ధం….

ఇక కృష్ణ గారి అంతిమ వీడ్కోలు సమయంలో అభిమానుల సందర్శనం కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం లో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. ఎక్కడినుండో కృష్ణ గారిని చూడటానికి అభిమానులు వచ్చారు. అంతలా అభిమానులు వస్తారని ఎవరు ఊహించలేదు కూడా. అయితే వచ్చిన అభిమానులకి నిరాశ్ మిగిలింది. ఆయనను కడసారి చూసే అవకాశం అందరికి కలుగలేదు. ఈ విషయం గురించి కృష్ణ గారి సోదరుడు అధిశేషగిరి రావు గారు మాట్లాడుతూ ఆయన పార్ధివ దేహాన్ని మొదట గచ్చిబోలి కి తరలించాలని అనుకున్న ఆయన శరీరం ను అక్కడికి ఇక్కడికి తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెప్పడం వల్ల అక్కడికి తరలించలేదు అని చెప్పారు. ఇక కృష్ణ గారి శవం వద్ద రాత్రి ఎవరూ లేరనేది అవాస్తవం నా కొడుకు, మేనల్లుడు ఉన్నారు అంటూ చెప్పారు.

పద్మాలయా అంటే కృష్ణ గారికి ఇష్టం అందుకే అక్కడికి తరలించామని చెప్పారు. రాత్రి తొమ్మిది తరువాత ఆయనను చూడటానికి వచ్చిన వారిని అనుమతించలేదు, ఇది పోలీసుల నిర్ణయం అంటూ చెప్పారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయాలని కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకున్నాం. ఆయన గుర్తుగా పద్మాలయాలో ఘాట్ నిర్మాణం చేస్తాము అంటూ చెప్పారు అధిశేషగిరి రావు.