Producer Ambika Krishna : ప్రముఖ పారిశ్రామికవేత్తగా సినిమా నిర్మాతగా అలానే పొలిటీషియన్ గా ఉన్న అంబికా కృష్ణ అందరికీ సుపరిచితులు. ఆయన నిర్మించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మరి కొన్ని డిజాస్టర్ గా మిగిలి ఆయనకు భారీగా నష్టం కలిగించాయి. ఇక సినిమా ఇండస్ట్రీ బాగోగుల కోసం రాష్టం విభజన జరిగాక అధికార పార్టీలో ఉండి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇక రాజకీయాలు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలను తాజాగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చిరంజీవి వల్ల అందరం పోయాము…
ఇక చంద్రబాబు గారు నన్ను పిలిచి మాట్లాడాలని అడిగితే వెళ్లి కలిసి పార్టీలో చేరాను, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక అలా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచాను అంటూ చెప్పిన అంబికా కృష్ణ గారు రెండో సారి నాకు టికెట్ ఇవ్వలేదు, చంద్రబాబు గారు నియోజకవర్గంలో బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పి వేరేవాళ్లకు ఇవ్వడంతో సైలెంట్ గా ఉన్నాను అంటూ చెప్పారు.

ఇక 2009లో చంద్రబాబు గారు మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చినా చిరంజీవి గారి ప్రజారాజ్యం దెబ్బకి అందరూ ఓడిపోయారు అంటూ చెప్పారు. ఇక మళ్ళీ ఎలక్షన్ లో అందరి సమక్షంలో ఎమ్మెల్సి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సి టికెట్ మా నియోజకవర్గంలో రెండు సార్లు వేరేవాళ్లకి ఇచ్చారు. ఇంత మోసం భరించలేక నేను పార్టీ నుండి బయటికి వచ్చేసాను బీజేపీలో కొనసాగుతున్నాను అంటూ తెలిపారు.

































