Producer Aswini Dutt : వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత అశ్విని దత్. రాఘవేంద్ర రావు, అశ్విని దత్ కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. ఇక చాలా మంది యంగ్ హీరోస్ ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసిన బ్యానర్ వైజయంతి మూవీస్. కోనేళ్లుగా సినిమా నిర్మాణంకి దూరంగా ఉన్న అశ్విని దత్ ప్రస్తుతం కూతుర్ల నిర్మాణంలో వస్తున్న హిట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు, సీతా రామం వంటి సినిమాలను నిర్మించింది ఆయన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్. కూతుర్ల సక్సెస్ మరింత ఆనందాన్ని ఇస్తోందంటూ చేబుతున్న అశ్విని దత్ మహానటి సినిమా డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ను చిన్న అల్లుడిని చేసుకున్నారు. నాగ్ అశ్విన్ ను అల్లుడిగా ఎలా చేసుకున్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

అశ్విన్ అల్లుడిగా అవ్వడానికి ఆయనే కారణం…
నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ మహానటి సినిమా సమయంలోనే ప్రేమలో పడగా ఆ విషయం అశ్విని దత్ వరకు వెళ్లగా రాఘవేంద్ర రావు గారు మంచి కుర్రాడు డైరెక్టర్ గా కూడా మంచి టాలెంట్ ఉంది పెళ్లి చేయ్ వాళ్లకు అని సలహా ఇచ్చారట. రాఘవేంద్ర రావు గారే అశ్విన్ డైరెక్షన్ గురించి తెలిసి తనతో మంచి కథ ఉంది చిన్న బడ్జెట్ లో సినిమా తీయి అని అశ్విని దత్ గారికి మొదట సలహాలు కూడా ఇచ్చారట.

అలా డైరెక్టర్ గా సినిమా తీయడానికి వచ్చి ఏకంగా చిన్నల్లుడు అయిపోయాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్, అశ్విని దత్ తో కలిసి ప్రభాస్ హరోగా ప్రాజెక్ట్ కే రూపొందుతోంది. ఇక స్వప్న దత్ ఆల్రెడీ నిర్మాతగా తానేంటూ నిరూపించుకోగా ప్రియాంక దత్ షూటింగ్ లో బ్యాక్ గ్రౌండ్స్ ఎలా ఉండాలి సెట్స్ విషయంలో 70% తన సెలక్షన్ ఉంటుందంటూ కూతుర్ల గురించి చెప్పారు అశ్విని దత్.































