Producer Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తాజగా నాకూ గురూజీకి మధ్య ఏ గొడవలు లేవంటూ మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.

నేనూ మనిషినే… చీము నెత్తురు ఉన్నాయ్…
బండ్ల గణేష్ సినిమాల గురించి తన మీద ఉన్న వివాదాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మీద కేసులన్నింటిలోనూ ఖచ్చితంగా బయటపడుతానని చెప్పారు. ఇక ఒక్కోసారి తాను ఇండస్ట్రీలో కొంతమంది గురించి తాను చేసిన వాఖ్యల గురించి మాట్లాడుతూ తానూ మనిషినేనని, ఒక్కోసారి ఆవేశంలో మాట్లాడుతుంటామని చీము, నెత్తురు మాకూ ఉంటాయని మనిషినే కదా ఎమోషన్స్ ఉంటాయంటూ చెప్పారు బండ్ల.

తనకు డైరెక్టర్ త్రివిక్రమ్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆయనతో పెట్టుకునే అర్హత కానీ స్థాయి కానీ నాకు లేవంటూ చెప్పారు బండ్ల. గతంలో పవన్ కి తనకి మధ్య గురూజీ అడ్డుగా ఉన్నారంటూ, భగవంతుడికి భక్తుడికి మధ్య గురూజీ ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఇపుడు త్రివిక్రమ్ తో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ బండ్ల గణేష్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
































