Producer Chittibabu : తాజాగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో వచ్చే మార్పులను సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పని ఇక అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరోసారి కర్ణాటకలో గెలిచి పార్టీ కి కొన ఊపిరి అందించింది. కర్ణాటక రాష్ట్ర బీజేపీ పాలకుల అవినీతి అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఎన్నికల మీద చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నా బీజేపీ లీడర్స్ మాత్రం ఇంకా ఓటమికి కారణాలను వెతుక్కుంటున్నారు. తాజాగా బీజేపీ కర్ణాటకలో అధికారం కోల్పోడానికి కారణాలను ఆ పార్టీ నేత సీనియర్ నిర్మాత చిట్టిబాబు వివరించారు.

బీజేపీ ఓటమికి కారణం అదే…
కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్ణాటక లో గెలవగానే రాహుల్ ప్రధాని అయ్యాడన్నంతగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది, అవన్నీ జరిగేవి కాదు అంటూ చిట్టిబాబు మాట్లాడారు. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రతి ఎన్నికలకు జరుగుతోంది, మరోసారి ఆ సెంటిమెంట్ నిజమైంది. అలాగే ప్రతి చోటా తక్కువ మెజారిటీ తేడాతోనే కాంగ్రెస్ గెలిచింది కానీ బీజేపీ ని ఎక్కడా చిత్తిగా ఓడించలేదు. కొన్ని దొంగ ఓట్లు కూడా వేసి ఉండవచ్చు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక బీజేపీ ఓడిపోయినా నష్టం లేదని కేంద్ర రాజకీయాల్లో ఆ ప్రభావం ఉండదంటూ చెప్పారు. మోడీ తో రాహుల్ గాంధీ పోటీ పడితే గెలుపు ఎవరిదో అందరికీ తెలిసిందే. ఇక ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని కాంగ్రెస్ పోయినా గెలుపు బీజేపీ కి వస్తుంది. అలా కాదని కాంగ్రెస్ ఓవైపు ప్రాంతీయ పార్టీల కూటమి ఒక వైపు బీజేపీ ఒక వైపు నిలిచినా బీజేపీకే లాభం చేకూరుతుంది అంటూ అంచనాలు వేశారు.