Producer Chittibabu : తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇప్పుడు డార్లింగ్ కి ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు. ఆ కట్అవుట్ కి ఫిదా అయిపోయారు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా డార్లింగ్ అంటే క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఇక బయట ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా కామ్ గా కూల్ గా ఉంటాడని తనకు కంప్లిమెంట్స్ ఇస్తారు. అయితే బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కు సరైన హిట్ లేదు. నార్త్ ఇండియన్ డైరెక్టర్ల క్రియేటివిటీకి బలై పోతున్నారు ప్రభాస్ అంటూ నిర్మాత చిట్టిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

బాలీవుడ్ డైరెక్టర్లు నిన్ను ఆడుకుంటున్నారు…
ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత సహో పర్వలేదనిపించినా రాధే శ్యామ్ నిరాశ పరిచింది. ఇక ఆదిపురుష్ వివాదాలతో బాగా ఇబ్బంది పడింది. రామాయణం ను సరిగా అర్థం చేసుకోలేదని, మరోవైపు దక్షిణాది ప్రజలకు రుచించని విధంగా సినిమాను తెరకెక్కించి డైరెక్టర్ విఫలమయ్యారు. ఇక ఎపుడు ప్రభాస్ మరోసారి బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్టు కే’ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి అలాగే ప్రభాస్ కెరీర్ గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ ప్రభాస్ ను బాలీవుడ్ దర్శకులు నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ కే మళ్ళీ బాహుబలి తరువాత ప్రభాస్ కెరీర్ లో పెద్ద హిట్ అవుతుంది అంటూ చెప్పారు. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ మీద పక్కగా ఉంటూ సినిమా తీస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటివారు డబ్బులిస్తే నటించరు, కథలో వారి పాత్ర నచ్చితేనే నటిస్తారు. అలాంటి దిగ్గజ నటులు ఉన్నరంటే ఖచ్చితంగా సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అంటూ చెప్పారు.



























