Producer Chittibabu : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణి జయరాం. తమిళనాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ’ సినిమాలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాం కు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కాలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న కిందకి పడి దురదృష్టవశాత్తు మరణించారు. అయితే ఆమె ముఖం మీద మెడకు గాయాలు ఉండటం మూలాన అది హత్యా లేక సహజ మరణమా అనే అనుమానాలు రేకెత్తుతుండగా వీటి మీద సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు స్పందించారు.

హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది…
చిట్టిబాబు గారు వాణి జయరాం గురించి మాట్లాడుతూ సౌత్ లోనూ నార్త్ లోనూ ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ చెప్పారు. మ రీ ముఖ్యంగా టాలెంట్ తో నార్త్ కి వెళ్ళినపుడు అక్కడ లత మంగేష్కర్ ఆమెకు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడి అవకాశాలు ఆమెకు ఇవ్వకుండా చేసారని చిట్టిబాబు తెలిపారు. ఒకవేళ ఆమె ప్రతిభ ఆధారంగా ఆమెకు అవకాశాలు వచ్చుంటే లతా మంగేష్కర్ తో సమాన స్థాయిలో వాణి జయరాం ఉండేవారంటూ తెలిపారు. ఇక సౌత్ లో పాటలు బాగానే పాడినా ఎక్కువగా మెలోడీ సాంగ్స్ కే ఆమెను పరిమితం చేసారు అంటూ చెప్పారు.

ఆమె కిందకు పడి మరణించారని ఆ క్రమంలో దెబ్బలు తగిలాయి కానీ అది హత్య అయ్యుండక పోవచ్చు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ అవన్నీ వట్టి అనుమానాలే అంటూ చెప్పారు. పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన తరువాత అది తీసుకోకుండానే ఆమె వెళ్లిపోవడం బాధాకరం అంటూ చెప్పారు. అంతే కాక ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన శంకరాభరణం, స్వాతి కిరణం వంటి సినిమాల్లో అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ గారు మరణించిన మరుసటి రోజే ఆమె మరణించడం బాధాకరం. గొప్పవాళ్లందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం ఇండస్ట్రీ దురదృష్టం అంటూ అభిప్రాయపడ్డారు.



























