Producer Dhanunjaya reddy : మెగాస్టార్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా, ఒక రకంగా ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అంటే ‘ఖైదీ’ అని చెప్పొచ్చు. ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోయింది. 24 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఖైదీ సినిమా దాదాపు 8 కోట్ల కలెక్షన్స్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మరో మలుపు తిరిగింది. ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ హీరో గా చిరంజీవి అవతరించారు. ఇక ఆ సినిమాను నిర్మించింది సంయుక్త ప్రొడక్షన్ వారు, దర్శకుడు కోదండ రామి రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అమెరికన్ సినిమా ‘ఫస్ట్ బ్లడ్’ ఇన్స్పిరేషన్ తో తీసిన సినిమా. ఇక ఈ సినిమా తెలుగులోనే కాక హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలో కన్నడ, హిందీ లో కూడా మాధవి నే హీరోయిన్ కావడం విశేషం.

చిరంజీవి, మాధవి మధ్య గొడవలు…
ఇక ఖైదీ సినిమా 1983 లో విడుదల చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ మిగిలిన పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు చెందిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమా నిర్మాతలలో ఒకరైన ధనుంజయ రెడ్డి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమా కోసం చిరంజీవి గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ అక్షరాలా 1 లక్ష 10 వేలంటూ చెప్పారు.

ఇక హీరోయిన్ మాధవి కి 50 వేలు ఇచ్చినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి మాధవి మధ్య గొడవలు జరిగాయి అన్న విషయం మీద క్లారిటీ ఇచ్చారు ధనుంజయ రెడ్డిగారు. అభిప్రాయాబేధాలు అన్ని చోట్ల ఉంటాయని, చిన్న చిన్న అభిప్రాయాబేధాలే తప్ప గొడవలేమి జరగలేదని, ఇక నిర్మాతగా నాకు కొన్ని విషయాల్లో, కాస్ట్యూమ్స్ విషయంలో కొన్ని అభిప్రాయాబేధాలు వచ్చాయి కానీ గొడవలు జరిగేంత పెద్దగా ఏమి జరగలేదంటూ చెప్పారు.































