Producer Dil Raju : వెంకటేశ్వర సినీ బ్యానర్ మీద ఎన్నో చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు గారు తన సినిమాలకు కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం కాకుండా కథ, నటీనటుల ఎంపిక ఇలా అన్ని విషయాల్లో తన మార్కు చూపిస్తూ సినిమాను సక్సెస్ చేసుకుంటారు దిల్ రాజు. డిస్ట్రిబ్యూషనన్ తో మొదలు పెట్టి తరువాత నిర్మాతగా మారి ఇప్పుడు ఎక్కువ థియేటర్లను కలిగి ఉండి ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తుల్లో ఒకడిగా దిల్ రాజ ఉన్నారు. ఇక ఆయన రెడ్డి అనే విషయం చాలా మందికి ఇన్ని రోజులు తెలియదు. కానీ ఇటీవల జరిగిన కొన్ని ఇష్యూల వల్ల ఆ విషయం అందరికీ తెలిసిందంటూ ఆయన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

పవన్ చెప్పాకే అందరికీ తెలిసింది…
ఏపీ లో సినిమాల విడుదల అప్పుడు టికెట్ రేట్ల ఇష్యూ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ సినిమాల విడుదల విషయంలో పెట్టిన ఇబ్బందుల వల్ల నిర్మాతలు, అగ్ర హీరోలు సీఎంతో భేటీ అయి చర్చించి సమస్యను పరిష్కరించారు. ఇక ఆ సమయంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు సహకరించాలని సీఎం జగన్ ను అడగాలని అనుకుంటున్న సమయంలో ఏపీ లో ప్రత్యర్థి గా రాజకీయల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మీ నాయకుడే కదా వెళ్లి అడగండి అని మీడియా ముందు చెప్పాడు.

దీంతో అందరితో పాటు నేను షాక్ అయ్యాను అంటూ దిల్ రాజు చెప్పారు. అంతే కాకుండా అలా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన తరువాతే అందరికీ నేను రెడ్డి అనే విషయం తెలిసిందంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం ఇరు ప్రభుత్వాలతో సినిమా ఇండస్ట్రీ సఖ్యతగా ఉంటోందని ఎప్పుడైనా అధికారంలో ఎవరు ఉన్నా వారితో అనుకూలంగా ఉండాలే కానీ వ్యతిరేకంగా ఉండకూడదు అంటూ దిల్ రాజు అభిప్రాయపడ్డారు.































