Producer J.Radha Krishna Murthi : అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమా దాదాపు నలభై ఏళ్ళ తరువాత విడుదలయింది. సినిమా అనేక అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు విడుదల కాగా తాజాగా ఆ సినిమా నిర్మాత వార్తల్లో నిలిచారు. నన్ను మోసం చేసారు డిస్ట్రిబ్యూషన్ పేరుతో అంటూ పోలీసులను ఆశ్రయించారు. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. అప్పటి పాత చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సంశయం ఉన్నా నిర్మాత ప్రపంచ వ్యాప్తంగా రెండువందల థియేటర్లలో సినిమాను విడుదల చేశారట.

సినిమా డిస్ట్రిబ్యూషన్ పేరుతో మోసం…
రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ అనే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు సినిమా డిస్ట్రిబ్యూషన్ పేరుతో 13 లక్షలు నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి వద్ద సినిమా విడుదలకు అని చెప్పి తీసుకొని మోసం చేసారంటూ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేసారు. డిస్ట్రిబ్యూషన్ కి సంబంధిచిన ఈ నెల 9న రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ లకు ఫోన్ చేయగా వారు స్పందించలేదని వారి డ్రైవర్ బాలు ఈ ఇష్యూలో జోక్యం చేసుకుని దుర్భాషలడాడని చెప్పారు.

అంతే కాకుండా తన ఆఫీస్ కి వచ్చి కత్తితో పొడుస్తామని బెదిరించి ఆఫీస్ నుండి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లిపోయారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు మేరకు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ ల మీద ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




























