Producer Natti Kumar : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో నిర్మాతల మండలిలో మొదలయిన గొడవ ఆ మధ్య కాస్త కనిపించకపోయినా మళ్ళీ తెర మీదకు వచ్చింది. నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతున్న వేల మళ్ళీ విబేధాలు బయటకు వస్తున్నాయి. నిర్మాతల మండలిలో మొత్తం 48 ఓట్లు ఉండగా 25 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. ఈసారి సి.కళ్యాణ్ ఒకవైపు నిలుస్తుండగా మరోవైపు దిల్ రాజు బరిలోకి దిగుతున్నాడు. సి కళ్యాణ్ ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్న నట్టి కుమార్ ఈ ఎన్నికల గురించి మాట్లాడుతూ దిల్ రాజు మీద అలాగే పెద్ద నిర్మాతల మీద ఫైర్ అయ్యారు.

చిన్న సినిమా నిర్మాతలను తొక్కేస్తున్నారు…
నట్టి కుమార్ ఈ ఎన్నికల గురించి మాట్లాడుతూ పెద్ద నిర్మాతలు గెలిస్తే చిన్న నిర్మాతలకు మరింత అన్యాయం జరుగుతుందని చెప్పారు. మెడికల్ చెకప్స్ కోసం ఐదు వేలు కట్టాలని చెబుతున్నారు, చిన్న నిర్మాతలకు ఎలా సాధ్యమవుతుంది. ఇక దిల్ రాజు వంటి వారి ప్యానెల్ లో ఉన్న వారు గతంలోనూ నిర్మాతల మండలిలో పనిచేసారు. ఇన్ని రోజులలో ఒక్కసారైనా ఒక మీటింగ్ పెట్టి ఏవైనా చర్యలు తీసుకున్నారా.

ఒక నిర్మాత మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించాలని మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలకు చేయూత ఇవ్వాలి. నిర్మాతల మండలి చొరవ చూపిస్తేనే కదా ప్రభుత్వాలు పట్టించుకుంటాయి అంటూ నట్టి కూమర్ ఫైర్ అయ్యారు.