Producer Natti Kumar : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతల మండలి ఛాంబర్ లను పట్టించుకోవడం లేదు కేవలం కొంతమంది ప్రొడ్యూసర్లు గిల్డ్ గా ఏర్పడి సినిమాల విడుదల, సినిమాల టాక్స్లు అన్ని విషయాలలోనూ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో చిన్న హీరో అని తేడా లేకుండా అందరి హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ పూట హడావిడి చేస్తుంటాయి. అయితే ఈ సారి పండగకు పెద్ద సినిమాలే కాకుండా తమిళం నుండి విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తోంది. ఇక చిన్న చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ విషయంలోనే అసలు నిప్పు రాజుకుంది. ఈ విషయాల గురించి అలాగే దిల్ రాజు ఎలా సినిమా ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అన్న విషయాల మీద నిర్మాత నట్టి కుమార్ గారు ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ఇండస్ట్రీ దిల్ రాజు గుప్పెంట్లో ఉంది, పెద్ద హీరోలు ఆయనకు భయపడే పరిస్థితి…
దిల్ రాజు రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఉన్న థియేటర్లు ముప్పై ఐదే అంత మాత్రాన నేను సినిమా ఎన్ని థియేటర్లో ఉండాలో నిర్ణయిస్థాను, మోనోపోలీలా వ్యవహారిస్తున్నానంటూ మాట్లాడుతున్నారు. కేవలం ముప్పై థియేటర్లతో అది ఎలా చేయగలను అంటూ మాట్లాడారు. ఇక ఈ విషయాల గురించి నట్టి కుమార్ మాట్లాడుతూ దిల్ రాజు గారికి అల్లు గారికి ఇంకా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కలిసి సంయుక్తంగా సినిమా థియేటర్లను కొన్నారు. ఒక వైజాగ్ లోనే దాదాపు 90 థియేటర్లు ఉన్నాయి. ఇక గుంటూరు, విజయవాడ ల్లో గీత, యూవి, దిల్ రాజు ఇలా వీరి పార్టనర్ షిప్ లో చాలా థియేటర్స్ ఉన్నాయి.

ఇక తెలంగాణలో చాలా థియేటర్స్ దిల్ రాజుకి ఉన్నాయి. ఇక పార్టనర్ షిప్ లో ఉన్నా కూడా ఈయన మాటే ఎక్కువగా నడిస్తోంది. ఎందుకంటే సినిమాలను ఏడాది పొడవునా థియేటర్స్ కి ఇస్తూ మెయింటైనేన్స్ చూసుకుంటోంది దిల్ రాజు కాబట్టి. అయినా థియేటర్లకంటే ముందు ఎగ్జిబ్యూటర్లను అందరినీ ఈయన గుప్పెంట్లో పెట్టుకున్నాడు. ఇక ఇంతకుముందేమో డబ్బింగ్ సినిమాలకు సెకండ్ ప్రయారిటీ, స్ట్రైట్ సినిమాల తరువాత అవి అని అన్నారు. ఇప్పుడు డబ్బింగ్ సినిమా అయినా సంక్రాంతికి విడుదలచేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వారసుడు సినిమా ఆయన నిర్మాణం లో వస్తున్నది కాబట్టి. ఇలా తనకు అనుకూలంగా ఇండస్ట్రీలో రూల్స్ మారుస్తున్నాడు దిల్ రాజు. ఇక ప్రభుత్వాలతో అనుకూలంగా ఉంటూ చిన్న సినిమాలను ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ కలిసి చంపేశారు అంటూ ఫైర్ అయ్యాడు నట్టి కుమార్.



























