Producer Prasanna Kumar : నందమూరి తారకరామారావు గారు అనగానే అటు సినిమాలలోనూ ఇటు పాలిటిక్స్ లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కుటుంబం కూడా చాలా పెద్దది. ఆయన హీరోగా ఎంతో పేరు ప్రాఖ్యాతలు సంపాదించి ఆయన పిల్లలకు కోట్ల ఆస్తులే కాకుండా లెజెండ్రి వారసత్వం కూడా ఇచ్చారు. ఇక సినిమాల్లో ఉన్నపుడు పక్కన ఉన్నవారి గురించి కూడా ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారంటూ నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన ప్రసన్న కుమార్ గారు వివరించారు.

జయప్రదని తీసుకోడానికి కారణం…
ఎన్టీఆర్ గారు సినిమాలకు దూరమై ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన సమయంలో కూడా ఇంకా సినిమా వాళ్ళు ఓపెనింగ్స్ కి పిలవడం వంటివి జరిగేవి. ఆయన పూర్తిగా సినిమాలకు దూరం కాలేదు. అలాంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ రావు గారు అలాగే చదలవాడ తిరుపతి రావు గారు ఇద్దరూ సినిమా ఓపెనింగ్ కి రమ్మని పిలిచినపుడు జరిగిన సంఘటనలు ప్రసన్న కుమార్ తెలిపారు.

వారిద్దరూ కృష్ణం రాజుగారు హీరో గా జయసుధ హీరోయిన్ గా సినిమా చేయాలనుకుని ఓపెనింగ్ కి ఎన్టీఆర్ గారిని కలిస్తే హీరోయిన్ గా జయసుధకు మంచి అవకాశాలు వస్తున్నాయి మంచి ప్లేసులో ఉంది, ఈ మధ్య జయప్రద వ్యక్తిగతంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది తనకు అవకాశం ఇస్తే కొంచం కాన్ఫిడెన్స్ వస్తుంది. జయసుధని కాకుండా జయప్రదని హీరోయిన్ గా తీసుకోండి అంటూ సలహా ఇచ్చారట ఎన్టీఆర్. అలా తనతో కలిసి పనిచేసిన ఆర్టిస్టుల గురించి కూడా ఆలోచిస్తారు ఎన్టీఆర్ అంటూ చెప్పారు.