Producer Rama Sathyanarayana : సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం, ఎంతోమంది సినిమాల్లో నటించాలనో, డైరెక్టర్ అవ్వాలనో, సినిమా నిర్మించాలనో సినిమా రంగంలో ఎలాగోలా స్థిరపడాలని అనుకుంటారు. అలా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చినా సక్సెస్ అయ్యేది మాత్రం కొంతమందే. ఇక అలానే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తన పేరు చూసుకోవాలని వచ్చి తాను ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు రామ సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోవాలనే తపనతో తాను పోగొట్టుకున్న డబ్బును గురించి వివరించారు.

కృష్ణ గారికి ఐదు లక్షలిచ్చి…
రామ సత్య నారాయణ గారు సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న విషయాల గురించి మాట్లాడుతూ సినిమాలో ప్రొడ్యూసర్ గా పెట్టుబడి పెట్టి నష్టపోయాక ఇక ఈ ఇండస్ట్రీ వద్దు నా వ్యాపారమే నాకు మేలు అనుకుని వెళ్లిపోయే సమయానికి నా స్నేహితుడు ఒకాయన ఇండస్ట్రీ అంటే మోసం కాదు నువ్వు వెళ్లిన మార్గం తప్పు అని సినిమా నిర్మాణం అర్థం చేసుకో అని చెప్పి తనతో ఉండని సలహాలు ఇవ్వడంతో ఆయన వద్ద ఉండి సినిమా నిర్మాణం చూసుకున్నారట. అలా అతని సినిమా అయ్యాక కృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని సత్యనారాయణ గారు చెప్పి కృష్ణ గారి డేట్స్ నేను తెస్తానని కృష్ణ వద్ద ఉన్న ఒకాయన ద్వారా కృష్ణ గారిని కలిసి సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పి అభిమానిని అని పరిచయం చేసుకుని ఆయనని సినిమా చేయమని అడుగగా ఆయన చూద్దాం అని చెప్పారట.

ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇస్తే వద్దని కృష్ణ గారు చెప్పారట. అయినా సత్యనారాయణ గారు వినకుండా ఉంచండి మీకు సినిమా చేయడం ఇష్టం లేకపోతే రేపు వచ్చి అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటా అని చెబితే ఆయన ఆంగీకరించారట. చివరకు కృష్ణ గారికి వీళ్ళు నచ్చి సినిమా చేస్తానని చెప్పగా అలా సినిమా చేసిన సత్యనారాయణ గారి పేరు ప్రొడ్యూసర్ గా వేయించుకోలేదు. అంతకు ముందు కూడా నిర్మాత అవ్వాలనే మోజుతో ఒక్కో సినిమాలో ఐదు లక్షల చొప్పున పెట్టుబబ్ది పెట్టగా ఇరవై ఐదు లక్షలు పోయాయి అంటూ చెప్పారు.































