Producer Suresh Babu : మూవీ మొఘల్ రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. సినిమా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే స్టూడియో ద్వారా కూడా ఎన్నో సినిమాలకు సదుపాయలను అందుబాటులో ఉంచారు. ఇక రామానాయుడు గారి కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరూ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. సురేష్ బాబు తండ్రి లాగా నిర్మాణ రంగంలో ఉంటూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక వెంకటేష్ గారు అగ్ర హీరోగా ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇక సినిమా రంగంలో పెద్ద కుటుంబాల్లో ఒకటిగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అయితే ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. ఇక ఇలాంటి విషయాల మీద సురేష్ బాబు గారు మాట్లాడారు.

పార్టీకి చాలా ఖర్చు పెట్టాం…
రాజకీయ నాయకుల్లో చాలా మంది వివిధ పార్టీల వాళ్ళు స్నేహితులుగా ఉండటం వల్ల వారికి ప్రచార కార్యక్రమాలు ఇలాంటివి డిజైన్ చేయడం వల్ల రాజకీయాల మీద కొంత ఆసక్తి ఉంది. ఇక అలా తండ్రి రామానాయుడు గారిని రాజకీయాల్లోకి వెళితే బాగుంటుంది సమాజానికి ఉపయోగపడే పనులని చేయొచ్చని సురేష్ బాబు సలహా ఇచ్చి ఆయనతో ఎంపీ గా పోటీ చేయించారు. ఎంపీగా గెలిచాక పార్టీ, వర్గాలు ఇలాంటి బేదాలు లేకుండా అందరికీ పనులు చేసిపెట్టారట. అయితే గెలిచాక ప్రతిపక్షంతో పోరాడటం కంటే స్వపక్షంలో ఉన్న నాయకులకు సర్ది చెప్పడం, వారితో పోరాటంకే ఆరు నెలల సమయం పట్టిందని రాజకీయాలు ఎలా ఉంటాయో దిగాకే తెలిసిందంటూ సురేష్ బాబు చెప్పారు.

ఇక రెండో సారి పోటీ చేసినపుడు వీళ్ళు నియోజకవర్గం అభివృద్ధికి ఉపయోగపడుతారు అని ఎంపిక చేస్తే వాళ్ళు ఓడిపోయారు. ఇక ఎంపీ గా రామానాయుడు గారు ఓడిపోయాక చంద్రబాబు నాయుడు వద్ద సురేష్ బాబు ఒకటే చెప్పారట, రాజకీయాలు ఇలా ఉంటాయని తెలియదు స్వపక్షం తోనే పోరాటం చేయాలి ప్రతిపక్షంతో కాదు అంటూ చెప్పి ఇలాంటి రాజకీయాలు మాకొద్దని వచ్చేసారట. తండ్రి ఎంపీ గా ఉన్నపుడు ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ నుండి ఎన్నో సార్లు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోండి ఏవైనా చేయాలనుకుంటే అనుమతులు ఇస్తామని ఆఫర్స్ వచ్చినా ఎంపీ పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదని అనుకుని అలాంటి పనులు చేయలేదని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.































