Producer Tammareddy Bhardwaja : తెలుగు సీనియర్ నిర్మాత మరియు దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరుంది. తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలను తీసారు. ఇక తమ్మారెడ్డి అనగానే కృష్ణ గారితో తీసిన ‘పచ్చని సంసారం’ సినిమా గుర్తొస్తుంది. చిరంజీవి ‘కోతలరాయుడు’ సినిమాతో నిర్మాతగా మారిన తమ్మారెడ్డి ‘పోతే పోనీ’ లాంటి సామాజిక అంశాలతో కూడిన సినిమా కూడా చేసారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చింది. ఇక ఆయన తన సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రాజశేఖర్ తో గొడవ…
రాజశేఖర్ హీరోగా తమ్మారెడ్డి గారి దర్శకత్వంలో హిందీ సినిమా బాజీఘర్ రీమేక్ గా వచ్చిన ‘వేటగాడు’ సినిమా షూటింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరిగాయని చెప్పారు తమ్మారెడ్డి. సినిమా షూటింగ్ కేవలం ఆరు నెలల్లో అయిపోతుంది అనుకుంటే ఎక్కువ టైం తీసుకుందని ఒక పాటకోసమే పది లక్షలు పెట్టి సెట్ వేయడం వల్ల మరింత బడ్జెట్ పెరిగిందని వివరించారు. ఒక పాటకు పదిలక్షల సెట్ అప్పట్లో ఎవరూ వేసేవారు కాదు నాకు అహంకారం ఎక్కువై అలా చేసానని మళ్ళీ అనిపించింది.

ఇక రాజశేఖర్ తో చిన్న మనస్పర్తల వల్ల సంవత్సరం పాటు ఇబ్బందిగానే ఉండేవాడిని. అయితే రాజశేఖర్ మాత్రం పుట్టినరోజు రోజులకు ఫోన్ చేసి రమ్మని పిలిచేవాడు. నాకు కొంత ఇబ్బందిగా అనిపించినా వెళ్ళేవాడిని ఒక ఏడాది పోయాక ఇక మళ్ళీ మామూలుగానే మాట్లాడాను అంటూ భరద్వాజ వివరించారు.

































