Pruthvi : తెలుగు సినిమాలో పృథ్వీ అని చెప్పే కంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెబితే బాగా గుర్తొస్తాడు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కామెడీ చేసిన పృథ్వీ చాలా సినిమాల్లో నటించినా మళ్ళీ అంత పేరు తెచ్చుకున్నది లౌక్యం సినిమాతోనే. లౌక్యం సినిమాలో బబ్లు పాత్రలో బాగా కామెడీ పండించాడు. ఇక రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. ఇక ఆర్టిస్టుల గురించి ఆయన ఆర్ధిక కష్టాల గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఆర్టిస్టుల బతుకులు వ్యభిచారి లాంటివి.. అందంగా ఉంటేనే బుక్ అవుతారు….
తనకు ఖడ్గం సినిమాలో వచ్చిన పాత్రకు క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారిదే అంటూ చెప్పారు. ఇక సినిమాల్లో పెద్దగా సంపాదించలేదని ఒక సినిమాలో ఉంటే ఒక రెండు సీన్లు ఉంటాయి వాటికీ పెద్దగా ఏం రాదూ మహా అయితే 25 వేల దాకా వస్తుందంతే. కాని చుట్టూ ఉన్న బంధువులు చాలా వస్తుందనే భ్రమలో మాట్లాడుతారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆర్టిస్ట్ అన్నాక ఇస్త్రీ బట్టలు వేసుకుని మంచిగా రెడీ అయి కనిపించాలి. ఎందుకంటే అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. మన కష్టాలు కనిపించకూడదు. ఆర్టిస్ట్ బతుకు వ్యభిచారి లాంటింది అందంగా ఉంటేనే బుక్ చేస్తారంటూ మాట్లాడారు.

ఇక కరోనా సమయంలో చాలా సీరియస్ కండిషన్స్ లో ఉన్న సమయంలో లక్షలు ఖర్చయ్యాయని చెప్పారు. ఇక అవకాశాలు వస్తే చాలని చిన్నా పెద్ద అని తేడా లేకుండా అన్ని చేయడమే తప్పయిందని చెప్పారు. ఇక బంధువులు కొంచెం ఆర్థికంగా బాగున్నా వాడుకున్నారని నాకు సమస్య వచ్చినపుడు ఎవరు లేరని వివరించాడు. నేనే డెబిట్ కార్డు, నేనే క్రెడిట్ కార్డు అంటూ మాట్లాడారు.
































