Pruthvi : ‘రుక్కు రుక్కు మని రమనిస గుణమని’ పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ. ఆ పాటలు వచ్చి ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆయనను ‘పెళ్లి’ సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ గారు పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తన కొడుకు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

నా కొడుకు కి ఆ వ్యాధి ఉండటం వల్ల 9 ఏళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళాను…
పృథ్వీ గారి కొడుకు పుట్టిన తరువాత రెండేళ్లకు తాను అందరిలా నార్మల్ కిడ్ కాదు అని అర్థమైంది. తాను ‘ఆటిజం’తో బాధపడుతున్నట్లు తెలిసింది. తన మెదడులో అందరికీ ఉన్నట్లుగా ఒక నరానికి సంబంధిచిన కదలికలు లేకపోవడం వల్ల తాను మాట్లాడడం ఎదుటివారి మాటలకు స్పందించడం చేయడు. అలాగే తన వయసు పిల్లలకంటే నేర్చుకోవడం అన్నింటిలోనూ నెమ్మదిగా ఉంటాడు. తనకు ఉన్న ఈ సమస్య మందులకు, చికిత్సతో తగ్గించేది కూడా కాదు. ఇక తన గురించి అలోచించి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ అందుకే సినిమాలను కూడా కొన్నేళ్లు వదిలేసాను అంటూ చెప్పారు పృథ్వీ.

ఎందుకు ఇక చేయాలి సినిమాలు, ఎందుకు డబ్బు సంపాదించాలి అనే వైరాగ్యం వచ్చింది. కానీ మళ్ళీ నా ఆలోచన తప్పని అర్థమైంది. మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను. నా కొడుకు నాకు బలహీనత కాదు బలం అని అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం 27 వయసులో ఉన్న నా కొడుకు అన్ని పనులు తానే చేసుకోగలడు. కాకపోతే మాట్లాడలేడు, అందరిలో ఉండడు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతాడు అంటూ చెప్పారు. ఇక సినిమాలు మళ్ళీ చేసాక ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. ప్రతిరోజు జిమ్ చేస్తాను అంటూ చెప్పారు.































