Pujitha Ponnada : విశాఖపట్నంకు చెందిన పూజిత హాబీలా మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం, ఆ తరువాత నాగార్జున ఊపిరి సినిమాలో అవకాశంతో సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా పని చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటించిన పూజిత ఇక రంగస్థలం వంటి పెద్ద సినిమాలతో బిజీ అయింది. ఇక రామ్ చరణ్ తో నటించిన పూజిత, పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీర మల్లు’ లో కూడా నటిస్తోంది. ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించునుంది పూజిత. ఇక ఈ మధ్యనే ‘ఆకాశ వీధిలో’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజిత ఆ సినిమా విశేషాలతో పాటు తన లవ్ బ్రేక్ అప్స్ గురించి కూడా తెలిపింది.

అర్జున్ తో ప్రేమ బ్రేక్ అప్…
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అర్జున్ మోడలింగ్ రంగం లో ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతంలో పూజిత పొన్నాడ, అర్జున్ డేటింగ్ లో ఉన్నారట. ఈ విషయాన్ని పూజిత తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది. అయితే ఇద్దరూ కలిసి నిర్ణయించుకుని విడిపోయామని పూజిత వివరించింది. బ్రేక్ అప్ లో ఎలాంటి విషాదం లేదని ఇప్పటికీ అతనితో స్నేహంగా ఉంటున్నానని పూజిత పొన్నాడ చెప్పింది.

ఇక ఇద్దరూ ప్రేమలో ఉన్నపుడు మొదట అర్జున్ ప్రపోజ్ చేసాడని ఇండస్ట్రీ వాడవటం వల్ల మా విషయం ఎక్కువ హైలైట్ అయిందని అంతే తప్ప మరేమి లేదు అంటు చెప్పింది పూజత పొన్నాడ. ఇక అర్జున్ ప్రస్తుతం బిగ్ బాస్ కి వెళ్ళాడు కనుక తనకు మంచి సక్సెస్ దొరకాలనీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది పూజిత పొన్నాడ.



























