Pulsar Bike Jhansi : పల్సర్ బైక్ జాన్సీ నటించిన రంగస్వామి సినిమా… ఛాన్స్ మిస్సయ్యాను అంటున్న హీరో సుమన్…!

0
386

Pulsar Bike Jhansi : ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిసారి కొత్తవాళ్ళను తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే పల్సర్ బైక్ అనే జానపద గీతానికి స్టెప్పులతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఆమె డాన్స్ కి సంబందించిన వీడియో బాగా పాపులర్ అయింది. ఇక చాలా యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలంటూ బిజీ అయిపోయారు ఝాన్సీ. ఇటీవల మాస్ రాజా చిత్రం ‘ధమాకా’లో కూడా ఆమె పేరు చెప్పి ఆ పాటకు డాన్స్ వేయడంతో ఆమె పాపులరిటీ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ‘రంగస్వామి’ అనే సినిమాలో నటిస్తున్నారు ఝాన్సీ.

రంగస్వామి సినిమాలో అవకాశం మిస్ అయ్యాను…

నరసింహాచారి, భాస్కర్ రెడ్డి, డా.సకారం, మారుతి, చిత్రం శీను, మీనాక్షి రెడ్డి, ఝాన్సీ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం రంగస్వామి. డ్రీమ్ సినిమా పథకంపై స్వీయ దర్శకత్వంలో నరసింహాచారి నిర్మించిన ఈ సినిమా డ్రగ్స్ వల్ల యువత పడుతున్న కష్టాల నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాను సీనియర్ హీరో సుమన్ చూసారు. సినిమా మీద తన అభిప్రాయం చెబుతూ డ్రగ్స్ వాడుతున్నపుడు హాయిగా ఉన్నా ఆ తరువాత ఎదురయ్యే సమస్యలను చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారని నటీనటులందరూ చక్కగా చేసారని చెప్పారు.

ఇలాంటి సినిమాలో చేయనందుకు బాధగా ఉందని తెలిపారు. ఈ సినిమా వారి తదుపరి చిత్రంలో ఖచ్చితంగా నటిస్తానని చెప్పడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సినిమా చూసాక మైండ్ చాలా ఫ్రెష్ అయిందని, ఎమోషన్స్ పండించడం చాలా కష్టం కానీ ఈ సినిమాలో అందరు ఆర్టిస్టులు చాలా చక్కగా చేసారంటూ తెలిపారు. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం అంటూ చెప్పారు సుమన్.