Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ మెప్పిస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన రోజు రోజుకు తన అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాస్త ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తుంది. ఇలా తన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటూ ఉన్నారు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ…తాను అనారోగ్య సమస్యల నుంచి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.పెళ్లయిన కొత్తలో తనకు ప్రతిరోజు ముక్కులో నుంచి రక్తం కారేది అయితే తన భార్య డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళగా అప్పుడే తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని ప్రసాద్ తెలిపారు.
అదేవిధంగా తన కాలులో చీము రావడంతో బాగా నొప్పి వేసేదని నడవలేని పరిస్థితికి కూడా తాను వెళ్లిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో తిరిగి షోలు చేసుకుంటున్నానని తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఇక తనకు సర్జరీ చేయడానికి కిడ్నీ డోనర్ అవసరమైంది. ప్రస్తుతం తనకు కిడ్నీ డోనర్ కూడా దొరికారని కానీ కాలిలో చీము రావడం నొప్పి చేయటం వల్ల డాక్టర్లు సర్జరీ చేయలేదని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత సర్జరీ నిర్వహిస్తారని తెలిపారు.
ఇక ఈయన సర్జరీకి అయ్యే ఖర్చును భరించడం కోసం ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ కిరాక్ ఆర్ పి సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇక తన కోసం తనకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన వారందరికీ ఈయన ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇక తనకోసం ఓ అభిమాని ఏకంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండలు కాలినడకన ఎక్కి వెళ్లారని తెలిసింది. అయితే తనను అభిమానించేవారు ఇంతలా ఉన్నారా అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…