కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేడు,రాడు మరణ వార్త విని ఇప్పటికి 12 మంది అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో పునీత్ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక మరణం తర్వాత మొదటిసారిగా తన భార్య అశ్విని స్పందించింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిసింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ మరణం తన కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది.పునీత్ ఇక లేడు అన్న విషయం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తెలిపింది. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అంటూ ఆమె తెలిపింది.
అలాగే పునీత్ మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడిన మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు అని తెలిపింది అశ్విని. అశ్విని తో పాటు హీరో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర లు కూడా అభిమానులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
అదేవిధంగా అంత్యక్రియల దృశ్యాలను పదే పదే ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పునీత్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ ని కడసారిగా చూసుకునేందుకు కంఠీరవ స్టూడియో కి లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు సైతం అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…