Purna : తెలుగు సినీ పరిశ్రమకు శ్రీ మహాలక్ష్మి సినిమాతో పరిచయమైన పూర్ణ, తరువాత అల్లరి నరేష్ తో కలసి నటించిన సీమ టపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అటు తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవిబాబు దర్శకత్వంలో అవును, వంటి సినిమాలను చేసిన పూర్ణ ప్రస్తుతం ఈటీవీలో వస్తున్న ఢీ డాన్స్ షో కి జడ్జి గా కూడా వ్యవహరిస్తూ మరింత ఇమేజ్ తెచ్చుకుంది. ఇక పూర్ణ ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాలో నటించింది. చేతి నిండా సినిమాలతో పూర్ణ కెరీర్ జోరుగా సాగుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం లో 7 సినిమాలు చేస్తోంది. తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, బ్యాక్ డోర్, ఇక తమిళ్ లో పాదుమ్ పెసుమ్ , పిషాసు 2, అమ్మాయి, నెంజుకు నీతి సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అటు మలయాళంలో వ్రిధం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇలా కెరీర్ లో ఫుల్ బిజీగా వున్న పూర్ణ తాజాగా తన పెళ్లి గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కాబోయే భర్త షానిద్ అసిఫ్ అలీ ఫోటోను షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అయితే ఇపుడు అందరు పూర్ణ కాబోయే భర్త గురించి, అతని బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
పూర్ణ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్….

పూర్ణ కాబోయే భర్త పేరు ప్రకటించినప్పటి నుండి ఎవరు అలీ, ఏం చేస్తుంటారు అన్న దాని గురించి ఎక్కువగా వెతుకుతున్నారు. అయితే షానిద్ అసిఫ్ అలీ ఒక వ్యాపారవేత్త. అసిఫ్ అలీ కోట్ల రూపాయలకు అధిపతి అయిన జేబీఎస్ గ్రూప్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో. దుబాయ్ వేదికగా అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తుంటుంది. అలీ ఒక బిజినెస్ కన్సల్ టెన్సీ, డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్ అందించే సంస్థకు అధినేత. వీరి కంపెనీ యూఏఈలో వ్యాపారాలు చేసుకునే వారికి డాక్యుమెంటేషన్ పరంగా, పర్మిషన్స్ విషయంలో సర్వీసెస్ అందిస్తుంటుంది. అంతేకాకుండా ఇమిగ్రేషన్, వీసా అనుమతులకు సంబంధించి సేవలు కూడా అందిస్తుంటారు. ఇక షానిద్ అసిఫ్ అలీ ఆస్తులు కోట్లలోనే ఉన్నట్టు సమాచారం.


































