RGV: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయనపై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కూటమి నేతలకు అలాగే పోలీసులకు కౌంటర్లు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఇకపోతే రాంగోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ మెగా కుటుంబానికి కూడా కౌంటర్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మెగాస్టార్ కంటే కూడా ఈయనే సూపర్ అన్నట్టు ఈయన పోస్ట్ చేయడంతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

RGV: ప్లానెట్ స్టార్..
పుష్ప 2 విడుదలకు ముందుకూడా మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని వర్మ కితాబునిచ్చాడు. ఏది ఏమైనా ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ కూటమి నేతలను అలాగే మెగా హీరోలను ఇలా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.































