Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తెలుగు ప్రేక్షకులు అలాగే దర్శకుడు సుకుమార్ అని తెలిపారు. సుకుమార్ వల్లే నటుడుగా నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.
ఆయన ఆర్య సినిమాతో నాకు లైఫ్ ఇచ్చారు. పుష్ప సినిమాతో నన్ను నేషనల్ స్టార్ ను చేసారు అంటూ అల్లు అర్జున్ తెలిపారు. 69 సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ జాతీయ పురస్కారం రాలేదు. కానీ ఆ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి నేనే అంటూ అందుకు కారణం సుకుమార్ అల్లు అర్జున్ తెలిపారు.
పుష్ప టీమ్ తో నేను ఐదు సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను అయితే పుష్ప 2 విడుదల కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను ఈ సినిమా కోసం నా కుమార్తె నాకు దూరమవుతుందని తెలిపారు. ఈ సినిమా కోసం నేను బాగా గడ్డం పెంచుకోవడం వల్ల తన కుమార్తెను ముద్దు పెట్టుకోవడానికి వెళ్లిన తను ఇబ్బంది పడుతూ దూరం వెళుతుందని అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను అంటూ అల్లు అర్జున్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…