Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా..వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. బన్నీ ఊరమాస్ గెలప్ లో ఎర్ర చందనం స్మగ్లర్ గా నటించాడు.

ప్యాన్ ఇండియా లెవల్లో రూపొందిన ఈసినిమా అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ముందు నుంచి ఈసినిమాపై అంచానాలు భారీగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్లలో కూడా ఎక్కడ తగ్గేది లే అంటూ.. చిత్ర యూనిట్ కష్టపడింది.

దీంతో పాటు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ సినిమాలపై హైప్ ను మరింతగా పెంచాయి. ముఖ్యంగా సమంత ఐటెం సాంగ్ అంచనాలను మరింతగా పెంచాయి. ’’ ఊ అంటావా మావా..ఊఊ అంటావా‘‘ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ పాటపై వివాదాలు వచ్చినా.. అంతే స్థాయిలో హిట్ కొట్టింది.
ఆకట్టుకునేలా చిన్నారి వీడియో..
దేవీశ్రీ ప్రసాద్ మెస్మరైజింగ్ కంపోజిషన్ పాటకు క్రేజ్ తీసుకువచ్చింది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న ’’ ఊ అంటావా మావా..ఊఊ అంటావా‘‘ పాట మానియా ప్రస్తుతం పిల్లల్ని కూడా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ పాట పిల్లల్ని ఎంతగా ఆకట్టుకుంది అనేది. వీడియోలో చిన్న పాపను who అని తల్లి అడగ్గా.. ’ఊ అంటావా మావా‘ అంటూ పాటపాడింది. ఈ పాప పాడిన పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Dey ????????????
— Confused Atma (@anubunnyfreak) December 26, 2021
Who antava mawa ????????
Cc @ThisIsDSP @PushpaMovie pic.twitter.com/XFUI58UBac































