Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా అన్ని భాషలలో ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే. ఇలా ఒక హీరో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యారు అంటే ఆయన చుట్టూ ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అంటూ హీరోల వెంటపడుతూ ఉంటారు.
ఇలా ఇప్పటికే అల్లు అర్జున్ రెడ్ బస్ ,జొమాటో వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ తాగే లిక్కర్ గ్లాస్ పై తమ లిక్కర్ కంపెనీ స్టిక్కర్ ఉండే విధంగా అలాగే ఆయన వేసుకునే పాన్ కూడా తమ కంపెనీకి సంబంధించినది అయి ఉండాలని ఇలా తమ సినిమాలో తమ లిక్కర్ అలాగే పాన్ ప్రమోట్ చేయాలి అంటూ ఓ బడా కంపెనీ అల్లు అర్జున్ వద్దకు వచ్చారట.
పుష్ప 2 సినిమాలో తమ లిక్కర్ అలాగే పాన్ ను ప్రమోట్ చేయడం కోసం ఈయనకు ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఇలా భారీ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ పని తాను చేయను అంటూ కరాకండిగా చెప్పేసారట నేను ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తే చాలామంది వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తాగి అనారోగ్యానికి గురి కావడం నాకు ఇష్టం లేదని ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన ఇలాంటి వాటిని నేను ప్రమోట్ చేయను అంటూ ఈయన చెప్పేసారట.
కోట్లు ఇచ్చిన ఆ పని చేయను…
ఇలా ప్రజల ఆరోగ్యానికి హానికరం చేసే వాటిని తాను ఎప్పుడూ ప్రమోట్ చేయను అంటూ అల్లు అర్జున్ చెప్పడంతో ఈయన ఎంతో గొప్ప ఆలోచన చేశారని అభిమానులు ఈయన ఆలోచన విధానం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2024ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…