R.K.Roja: వైసీపీ మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఓ వెలుగు వెలిగిన రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
ఇక వైసిపి పార్టీ తరఫున 2014 ,19 ఎన్నికలలో నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈమెకు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పదవి కూడా లభించింది. అయితే మంత్రిగా ఈమెకు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో 2024 ఎన్నికలలో పూర్తిగా ఓటమిపాలు అయ్యారు.
ఈ విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటమిపాలు కావటంతో రోజా కూడా రాజకీయాల పరంగా ఏమాత్రం యాక్టివ్ లేరని తెలుస్తుంది. పార్టీ కార్య కలాపాలకుదూరంగా ఉంటున్నటువంటి ఈమె ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు షోలలో సందడి చేస్తున్న రోజా తిరిగి వెండితెరపైకి రావడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ విధంగా రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఆసక్తి తగ్గించిన ఈమె ఇండస్ట్రీపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ రోజా ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత ప్రభుత్వ హయామంలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం మాత్రం రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడటం కూడా లేదు మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రోజా కూడా రాజకీయాల పరంగా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…