Rahul Ramakrishna bold comments on TV9: విశ్వక్ సేన్, దేవి నాగవల్లి వివాదం ఇంకా చల్లారడం లేదు అనే కంటే చల్లారనివ్వడం లేదు చెప్పొచ్చు. సినిమా కోసం ప్రాంక్ చేసిన విశ్వక్ తాను ఉహించిన దానికంటే ఎక్కువ ప్రమోషన్ను తెచ్చుకున్నాడు. ఇక వివాదంలో లాభపడింది ముమ్మాటికీ విశ్వక్ అనే చెప్పొచ్చు. టీఆర్పి కోసం డిబేట్లు పెట్టి విశ్వక్ ను వ్యక్తిగతంగా కించపరచడం గెట్ అవుట్ అనడం జనంలోకి బాగా పోయింది. ఇక సింపతీ విశ్వక్ కు బాగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ మాటలు మరింత విశ్వక్ కు సింపతీ పెంచేసాయి.

టీవీ 9 ను ఆడుకుంటున్న నెటిజన్స్…..
ఇక ఈ విషయంలో టీవీ 9 ను బాగా ట్రోల్ చేసారు. విశ్వక్ కు మొదట మద్ధతిచ్చిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ టీవీ9 పై వరుస ట్వీట్లతో ఏకిపారేసాడు. ఇక బాబు గోగినేని, కరాటే కళ్యాణి వంటి వారు కూడా టీవీ9 ను దేవి నాగవల్లి పై విమర్శలు గుప్పించారు. ఇక విశ్వక్ సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ వచ్చి ఇక ఈ రచ్చ చల్లారక ముందే సినిమా విడుదల అయింది. ఇక సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి ఈ వివాదం బాగా ప్లస్ అయింది.
@TV9Telugu మీకు అసలు ఏ మాత్రం సిగ్గు ఉందా?
— Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022
కానీ మరోసారి రాహుల్ రామకృష్ణ టీవీ9పై ట్వీట్స్ చేసాడు. అయితే ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది ఒక ప్రముఖ ఛానెల్ పై అలాంటి వాఖ్యలు చేయడం చాలా ధైర్యం ఉండాలంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక టీవీ 9 పై ఇంతకు ముందు కూడా రాహుల్ రామకృష్ణ కామెంట్స్ చేసాడు కానీ ఈసారి చాలా ఘాటుగా మీకు ఏమాత్రం అసలు సిగ్గుందా? అంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్స్ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇక కొంతమంది దీనికి రియాక్ట్ అవుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తరిమెటపుడు నువ్వు సరిగా పరిగెత్తకపోవడం వల్ల సినిమా 1000కోట్లే వసూలు చేసింది లేకపోతే 2000 కోట్లు వసూలు చేసెదని వార్తను ప్రసారం చేస్తారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేసారు. మరి టీవీ9 దీన్ని కూడా టీఆర్పి కోసం వాడుకుంటుందో లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకుంటుందో చూడాలి మరి.































