Rahul Ramakrishna : ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అరే మనం ఫ్రెండ్ కూడా ఇలానే ఉంటాడు అనే తన నటనతో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ తక్కువ టైములో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక మరోసారి ‘జాతీరత్నాలు’ సినిమాలో నా వల్లే ఏదైనా ప్రాబ్లెమ్ అయితే నేనే వెళ్ళిపోతారా అంటూ మరోసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్, విరాట పర్వం వంటి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ కు ట్విట్టర్ లో ఒక అభిమాని నుండి అనుకోని ప్రశ్న ఎదురైంది.

తాగేసి చాలా సార్లు ట్వీట్ చేశా…
రాహుల్ రామకృష్ణ అందరు సెలబ్రిటీల లాగానే సోషల్ మీడియాలో అభిమానులతో బాగా టచ్ లో ఉంటాడు. ఇక ఇటీవలే విశ్వక్ సేన్ విషయంలో tv9 పై ఎంతలా విమర్శలు గుప్పించాడో చూసాము. ఇక తాజాగా బోరింగ్ గా ఉంది ఎవరైనా రచనల మీద, సినిమాల మీద, సంగీతం మీద నన్ను ఏవైనా ప్రశ్నలు అడగండి అంటూ ఫాలోయర్స్ ను అడగడంతో కొంతమంది రొటీన్ ప్రశ్నలే వేశారు. తెలంగాణా మండలికం చాలా సహజంగా మాట్లాడుతున్నావ్ సినిమాల కోసమేనా లేక నిజంగా నీ భాష అదేనా అని అడిగారు. ఇక మరో నెటిజెన్ రీసెంట్ గా చదివిన పుస్తకం గురించి అడిగింది.

Taagesi tweets esinaa sandarbhaalu unnayaaa,Guru ??
— Tom (@Nenu_jerry) August 5, 2022
అయితే ఒక నెటిజెన్ మాత్రం వింత ప్రశ్న అడిగి రాహుల్ రామకృష్ణ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసాడు. ఎప్పుడైనా ట్విట్టర్ లో తాగేసి పోస్ట్లు పెట్టావా గురు అని అడుగగా.. రాహుల్ చాలా ఒపన్ గా అవును చాలా సార్లు అంటూ సమాధానం ఇచ్చాడు. లేదు అనో లేక చెప్పను అనో సమాధానం చెప్పి తప్పించుకుని ఉండొచ్చు కానీ రాహుల్ నిజాయితీ గా సమాధానం చెప్పడం తో ఇపుడు ఆయన ఫాలోయర్స్ కూడా పాజిటివ్ గా తీసుకుంటున్నారు.

































