Railway jobs @2023: ప్రభుత్వ కొలువు కోసమే కస్టపడుతూ ఏళ్ల కెళ్ళు చదివేస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఒకటి రెండు కాదు ఏకంగా 3 లక్షల ఉద్యోగలను రైల్వే శాఖ వదలనుంది. రైల్వే ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు మంచి అవకాశమనే చెప్పాలి. ప్రతి నెల ఒక నోటిఫికేషన్ వచ్చేలా ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది సెంట్రల్ రైల్వే. రైల్వే నియామకాలపై దాఖలైన సమాచార హక్కు చట్టం పిటిషన్ కు జవాబిస్తూ ఈ వివరాలు తెలిపింది.

2.90 లక్షల ఉద్యోగ నియామకాలు….
దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొన్న రైల్వే శాఖ అందులో గ్రూప్-సి పోస్టుల్లో అనగా క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ మొదలైనవి అక్షరాల 3,11,438 ఖాళీలు ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది . మరోవైపు గెజిటెడ్ క్యాడర్ హోదాలో 3,018 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది . మొత్తం ఇండియాలో ఉన్న టోటల్ 21 ఆర్ఆర్ బీ లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు . దాదాపు 3 లక్షల వరకు ఉన్న ఈ ఖాళీలను ఈ డిసెంబర్ చివరి నాటికి భర్తీ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. 1.5 లక్షలకు పైగా ఖాళీలు కేవలం గ్రూప్ డి, గ్రూప్ సి విభాగలలోనే ఉన్నాయి. ఇక గ్రూప్ డీ లోనే దాదాపు లక్షకుపైగా ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే సెంట్రల్ రైల్వే ఈ సంవత్సరం రెండు లక్షలకు పైగా పోస్టులకు నియామకాలు చేస్తుందని తెలిపారు . ఇందులో గ్రూప్ సీ అండ్ గ్రూప్ డీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు మంత్రి.

ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లు మినహాయించి మిగిలిన జోన్‌లలో 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు రైల్వే శాఖ వారు. అనగా సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టులు కూడా దాదాపు 10 వేలకు పైగా ఉన్నట్లు క్లారిటీ వస్తోంది . అంతే కాక గ్రూప్స్ ఏ , బి పోస్టులకు త్వరలో ఉద్యోగ భర్తీ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉద్యోగ భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అలా మొత్తానికి ఉద్యోగం కోసం కలలుకంటున్న ఎంతో మంది నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది.



























