Train accident : రైలు లో ప్రయాణం బాగుంటుంది కానీ కొంచెం అజాగ్రత్త గా ఉన్నా ప్రమాదం ఐటమ్స్ జరుగుతుంది. రైలు ప్రయాణం చేసేటపుడు రైలు ఎక్కేటపుడు దిగేటపుడు జాగ్రత్తగా వహించకుంటే ప్రాణం మీదకు వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ దువ్వాడ వద్ద జరిగిన ప్రమాదం అలాంటిదే. రోజు కాలేజ్ కి అదే రైలు లో ప్రయాణిస్తున్న అమ్మాయి రైలు దిగే సమయో ప్లాట్ ఫామ్ కి రైలు కి మధ్య ఇరుక్కుపోయి గంటల సేపు నరకం చూసింది. హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి చివరకు మరణించి తల్లిదండ్రులనూ చీకట్లోకి నెట్టేసింధి.

కోమాలో ఉన్న… చికిత్స పొందుతూ మృతి..
అన్నవరం లో ఉంటు రోజు దువ్వాడ కాలేజీ కి ప్రయాణిస్తున్న శశికళ గుంటూరు రాయగడ్ ఎక్సప్రెస్ లో ప్రయానిస్తుండగా దువ్వాడ స్టేషన్ లో దిగే సమయంలో ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఇక ఆ అమ్మాయి తండ్రి జరిగిన సంఘటనను వివరిస్తూ ట్రైన్ దిగే సమయంలో వెనుక నుండి ట్రైన్ డోర్ తగలడం తో ఇంకా రైలు ఆగకనే అమ్మాయి కిందపడి ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుందని తనతో ఉన్న స్నేహాతులు చెప్తున్నారంటు అయన ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే నేనే ట్రైన్ ఎక్కించానని ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు .

వెంటనే ట్రైన్ సిబ్బంది స్పందించి ప్లాట్ ఫామ్ ను కట్ చేసి అమ్మాయిని బయటకు తీశారు. అయితే రెండు గంటల సేపు ఇరుక్కుని నరకం చూసిన శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది . దువ్వాడలో ఎంసిఏ చదువుతున్న అమ్మాయి హాస్టల్ ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల అన్నవరం నుండి రోజు కాలేజీ కి ట్రైన్ లో వెళ్తోంది. హాస్పిటల్ లో వైద్యులు ఎంతో ప్రయత్నించిన శశికళ మరణించింది .































