రెండు తెలుగు రాష్ట్రాలైన అంద్రప్రదేశ్, తెలంగాణలో రతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశమంతా మేఘావృతమై ఉండటంతో పాటూ.. పలు చోట్ల వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటూ ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.

దక్షిణ భారత దేశమంతటా కూడా ఈ రుతుపవనాలు వ్యాప్తి చెంది మధ్య భారతంలో కొన్ని రాష్ట్రల్లో విస్తరించాయి. అటు ఒడిశా పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి.































