Raj Kiran : విశాల్ ‘పందెం కోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు రాజ్ కిరణ్, ఆ సినిమా ‘ముని’ సినిమా ద్వారా మనకు సుపరిచితుడే. ఇక తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉన్న రాజ్ కిరణ్, ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో వివాదం రావడంతో ఆయన పేస్ బుక్ ద్వారా అభిమానులకు వివరణ ఇచ్చారు. తన కూతురికి ఇక తన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

ప్రేమ వ్యవహారం నచ్చక…
రాజ్ కిరణ్ దంపతులు ప్రియ అనే ఒక అనాధ ను దత్తత తీసుకుని పెంచారు. అయితే ప్రియ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అతను మంచివాడు కాదని ఈ పెళ్లిని వ్యతిరేకించారు రాజ్ కిరణ్ దంపతులు. ఇక ప్రియ ప్రేమించిన వ్యక్తి ఒక సీరియల్ నటుడు, అతన్ని ఇష్టపడిన ప్రియ అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. ఇక ఈ విషయం నచ్చని రాజ్ కిరణ్ ఆమెను ఉద్దేశించి పేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ప్రియ నా పెంపుడు కూతురు, తనదో హిందూ మతం, చిన్నత్తనంలోనే తనను దత్తత తీసుకుని పెంచుకున్నాం. అయితే తాను పెంపుడు కూతురు అని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అందరికీ సొంత కూతురు అనే పరిచయం చేసాము.

కానీ తాను ఒక మోసగాడి వలలో పడి మా మాటలు వినడం లేదు. తను ప్రేమించిన వ్యక్తి గురించి వాకబు చేయగా అతడు డబ్బు కోసం, సినిమాల్లో అవకాశాల కోసం మాత్రమే ప్రియ ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం చెప్పినా ప్రియ వినే పరిస్థితిలో లేకుండా ఆమెను పూర్తిగా మార్చేశాడు. మొదటి నుండి ప్రియ కు నా భార్య సహాయం చేసేది, నేను ఎప్పుడైనా కోప్పడినా తను సపోర్ట్ గా కూతురికి ఉండేది. కానీ ఇప్పుడు నా భార్య మీద కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ పోస్ట్ ద్వారా చెప్పాలనుకుంటున్నది ఒకటే ప్రియ ఆమె భర్తకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ రాజ్ కిరణ్ వివరించారు.
































