Raja Ravindhra : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసిన రాజా రవీంద్ర అసలు పేరు రమేష్ దంతులూరి. మొదట్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ ఉండే రాజా రవీంద్ర, కొన్ని తమిళ సినిమాల్లో విలన్ గా కూడా చేసారు. ఇక హీరోగా కూడా చేసిన రాజా రవీంద్ర ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ఇక రాజా రవీంద్ర సినిమాల్లో నటించడమే కాకుండా కొంత మంది హీరోలకు డేట్లు కూడా చూస్తుంటారు. అలా నిఖిల్, జయసుధ, రాజ్ తరుణ్, వెంకటేష్, నవీన్ చంద్ర, మంచు విష్ణు సినిమా డేట్స్ చూసుకుంటున్నారు రాజా రవీంద్ర.

సౌందర్య విషయంలో అలా జరిగాక హీరోయిన్ల జోలికి పోకూడదని అనుకున్న…
హీరోల సినిమా డేట్స్ మేనేజ్ చేసే రాజా రవీంద్ర ఎందుకని హీరోయిన్ల డేట్స్ చూడరనే ప్రశ్న వచ్చినపుడు హీరోలు ఒకసారి ఒక సినిమా చేస్తారు, కానీ హీరోయిన్లు పలు భాషలలో ఏక కాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంటారు. అలాంటప్పుడు వారి డేట్స్ ను అడ్జస్ట్ చేయడం కష్టం. మిగతా భాషల మేనేజర్లతో మనం సర్దుబాటు చేసుకుని సినిమా ప్లాన్ చేయాలి. ఒక వేళ అన్ని భాషలలోనూ మనమే డేట్స్ చూసినా కూడా హీరోలను బట్టి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టం. సరిగా చేయకపోతే ఆ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి సౌందర్య గారి విషయంలో అదే జరిగింది.

ఏక కాలంలో ఆమె అటు హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమాలోను, తమిళం లో రజనీకాంత్ గారితోనూ అటు తెలుగులో చిరంజీవితో అన్నయ్య సినిమాలో నటించారు. ఆ సమయంలో ఒకసారి ఫ్లైట్ రద్దవడం వల్ల రజనీకాంత్ పడియప్పన్ సినిమా షూటింగ్ కి రాలేకపోయారు. దాంతో సౌందర్య గారి డేట్స్ చూసే మేనేజర్ టెన్షన్ నా కళ్లారా చుసాను. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను హీరోయిన్ల జోలికి పోకూడదని అంటూ చెప్పారు. అయితే జయసుధ గారంటే ఎంతో ఇష్టం అలాగే ఆవిడతో కలిసి ఆంటీ సినిమా చేసినప్పటి నుండి పరిచయం ఉండటంతో గత 15 ఏళ్లుగా ఆవిడ డేట్స్ చూస్తున్నానని చెప్పారు.
































