Featured

జీవిత కంటే ముందు శ్రీదేవి-రాజశేఖర్ పెళ్లి ఎలా ఆగిపోయిందో మీకు తెలుసా..?!

అతిలోక సుందరి,అప్సర, ముగ్ధ మనోహర రూపం,తన అందానితో ప్రేక్షకులను కట్టిపడేసే నటనాభినయం ఆమె సొంతం. 1976లో మొదటగా ఒక తమిళ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో పదహారేళ్ళ వయసు, వేటగాడు, ఆటగాడు, మోసగాడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, బెబ్బులిపులి, త్రిశూలం, దేవత, జగదేకవీరుడు అతిలోక సుందరి‌ సినిమాలలో నటించింది. తెలుగు తమిళ సినిమాల్లో చేస్తుండగానే హిందీలో అవకాశాలు రావడంతో అక్కడ అనతికాలంలోనే బిగ్ స్టార్స్ తో చేయడం వలన హిందీలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.

రాజశేఖర్ తన ఎం.బి.బి.ఎస్ పూర్తయిన తర్వాత అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమాల్లోకి వెళ్లడానికి మొదటగా రాజశేఖర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎమ్మెస్ పూర్తిచేసి డాక్టర్ అవ్వాలని వారి కోరిక, కానీ రాజశేఖర్ పట్టుపట్టడంతో కొన్ని షరతులు తో అతనిని సినిమాల్లో కి పంపించడం జరిగింది. సినిమాల్లో నటించు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని షరతు విధించారు. అలాగే అని డాక్టర్ రాజశేఖర్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదటగా తమిళ సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత 1985లో ప్రతిఘటన సినిమాలో ఓ క్యారెక్టర్ వేసినప్పటికీ వందేమాతరం సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

అయితే డాక్టర్ రాజశేఖర్ నాన్నగారు, శ్రీదేవి నాన్నగారు అయ్యప్పన్ మంచి స్నేహితులు ఆ పరిచయంతో రెండు కుటుంబాలు కలిసి మెలసి ఉండేవి. శ్రీదేవి తల్లి రాజేశ్వరికి రాజశేఖర్ అంటే చాలా ఇష్టం. ఆ చొరవతో శ్రీదేవిని రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేయాలననుకున్నారు. కానీ సినిమాకి సంబంధించిన అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదని రాజశేఖర్ తల్లిదండ్రులు నిరాకరించడంతో శ్రీదేవి రాజశేఖర్ మ్యారేజ్ ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయింది. సినిమాల్లోకి రాక ముందే రాజశేఖర్ కు ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత జీవిత తో కొన్ని సినిమా లు రాజశేఖర్ చేయడం జరిగింది.

ఆ తర్వాత జీవిత మొదటగా రాజశేఖర్ కు ప్రపోజల్ చేసినప్పటికీ రాజశేఖర్ తల్లిదండ్రులు విధించిన కండిషన్ తో మొదట ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1991లో మగాడు సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కు గాయాలు అయినప్పుడు జీవిత దగ్గర ఉండి సేవలు చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ కు సరిజోడి అని చివరికి వారి పెళ్లికి ఒప్పుకున్నారు.1991 లో జీవితా రాజశేఖర్ ల పెళ్లి జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago