అతిలోక సుందరి,అప్సర, ముగ్ధ మనోహర రూపం,తన అందానితో ప్రేక్షకులను కట్టిపడేసే నటనాభినయం ఆమె సొంతం. 1976లో మొదటగా ఒక తమిళ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో పదహారేళ్ళ వయసు, వేటగాడు, ఆటగాడు, మోసగాడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, బెబ్బులిపులి, త్రిశూలం, దేవత, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలలో నటించింది. తెలుగు తమిళ సినిమాల్లో చేస్తుండగానే హిందీలో అవకాశాలు రావడంతో అక్కడ అనతికాలంలోనే బిగ్ స్టార్స్ తో చేయడం వలన హిందీలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.

రాజశేఖర్ తన ఎం.బి.బి.ఎస్ పూర్తయిన తర్వాత అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమాల్లోకి వెళ్లడానికి మొదటగా రాజశేఖర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎమ్మెస్ పూర్తిచేసి డాక్టర్ అవ్వాలని వారి కోరిక, కానీ రాజశేఖర్ పట్టుపట్టడంతో కొన్ని షరతులు తో అతనిని సినిమాల్లో కి పంపించడం జరిగింది. సినిమాల్లో నటించు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని షరతు విధించారు. అలాగే అని డాక్టర్ రాజశేఖర్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదటగా తమిళ సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత 1985లో ప్రతిఘటన సినిమాలో ఓ క్యారెక్టర్ వేసినప్పటికీ వందేమాతరం సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

అయితే డాక్టర్ రాజశేఖర్ నాన్నగారు, శ్రీదేవి నాన్నగారు అయ్యప్పన్ మంచి స్నేహితులు ఆ పరిచయంతో రెండు కుటుంబాలు కలిసి మెలసి ఉండేవి. శ్రీదేవి తల్లి రాజేశ్వరికి రాజశేఖర్ అంటే చాలా ఇష్టం. ఆ చొరవతో శ్రీదేవిని రాజశేఖర్ కి ఇచ్చి పెళ్లి చేయాలననుకున్నారు. కానీ సినిమాకి సంబంధించిన అమ్మాయిలను పెళ్ళి చేసుకోకూడదని రాజశేఖర్ తల్లిదండ్రులు నిరాకరించడంతో శ్రీదేవి రాజశేఖర్ మ్యారేజ్ ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయింది. సినిమాల్లోకి రాక ముందే రాజశేఖర్ కు ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత జీవిత తో కొన్ని సినిమా లు రాజశేఖర్ చేయడం జరిగింది.

ఆ తర్వాత జీవిత మొదటగా రాజశేఖర్ కు ప్రపోజల్ చేసినప్పటికీ రాజశేఖర్ తల్లిదండ్రులు విధించిన కండిషన్ తో మొదట ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1991లో మగాడు సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కు గాయాలు అయినప్పుడు జీవిత దగ్గర ఉండి సేవలు చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ కు సరిజోడి అని చివరికి వారి పెళ్లికి ఒప్పుకున్నారు.1991 లో జీవితా రాజశేఖర్ ల పెళ్లి జరిగింది.

































