Rajendra prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా అందరిని సందడి చేశారు. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజేంద్రప్రసాద్ గతంలో ఒక సినిమా వేడుకలో భాగంగా తన కుమార్తె గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన గత కొద్ది రోజుల క్రితం బేవర్స్ సినిమా వేడుకలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తన కూతురి గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ తల్లి గురించి ఓ అద్భుతమైన పాట పాడారు ఈ పాట గురించి ఈయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన తల్లిని తన కూతురిలో చూసుకుంటారు.నేను పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తల్లి మరణించింది అందరిలా నేను కూడా నా కూతురిలో నా తల్లిని చూసుకున్నాను.

Rajendra prasad: తనని వదిలి వెళ్ళిపోయింది…
ఇలా నా తల్లిగా భావించే నా కూతురు ఒక వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. అప్పటినుంచి తనతో నాకు మాటలు లేవని ఇలా అమ్మలా చూసుకునే కూతురు కూడా తన నుంచి దూరంగా వెళ్లిపోయింది అంటూ ఈ సందర్భంగా ఈయన తన కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా కూతురు గురించి రాజేంద్రప్రసాద్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































