Rakesh master relative Sambasiva rao : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఇక ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఆయన శిష్యులు చేసారు.

రాకేష్ మాస్టర్ గురించి ఆలా మాట్లాడొద్దు…
రాకేష్ మాస్టర్ కి అత్యంత ఆప్తుడైన వ్యక్తి సాంబశివరావు గారు, విజయవాడ కు చెందిన సాంబశివరావు గారు శేఖర్ మాస్టర్ ద్వారా రాకేష్ మాస్టర్ కి తెలుసు. శేఖర్ మాస్టర్ మావయ్య అని పిలిచే వ్యక్తిని రాకేష్ మాస్టర్ పరిచయం అయ్యాక ఆయన కూడా మావయ్య అని పిలిచేవారంటూ సాంబశివరావు గుర్తు చేసుకున్నారు. శేఖర్, సత్య ఇలా శిష్యులతో కలిసి రాకేష్ కి ఏదైనా సాధించాలనే తపన ఉండేది. అలాంటి వ్యక్తి ఇలా అయిపోతాడని అనుకోలేదని చెప్పారు. నాపేరు కలిసివచ్చేలా డాన్స్ స్టూడియో కూడా పెట్టాము. ఇక ఎస్ఆర్కె పేరుతో ఫిల్మ్ ఫ్యాక్టరీ అని పెట్టాము. చూస్తుండగానే అందరి దారులు వేరేయ్యాయి.

కానీ రాకేష్ నాకు ఒక ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం చేసి నేను ముందు చనిపోతే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఇస్తున్నాను. ఇందులో ఏదైనా రాసి తీసుకో అని చెప్పాడు. ఒకవేళ నువ్వు ముందు పోతే నీ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటా అంటూ చెప్పాడు అని సాంబశివరావు ఆ సంతకం చేసిన బాండ్ పేపర్ ను పెద్ద కర్మ కార్యక్రమంలో చించేసారు. రాకేష్ మాస్టర్ సంపాదించిన రూపాయి అయినా తన కుటుంబానికి చెందాలి అంటూ చెప్పారు. యూట్యూబ్ లో ఏవేవో థంబ్ నైల్స్ పెడుతూ రాకేష్ మాస్టర్ గురించి రాస్తున్నారు, దయచేసి ఆలా చేయొద్దు అంటూ చెప్పారు.































