Rakesh Master : యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్న ఇష్యూ జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పి చేసిన కామెంట్స్. ఇక వీటి గురించి పలువురు జబర్దస్త్ కంటెస్టెంట్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక ఇపుడు కిర్రాక్ ఆర్పి విమర్శల గురించి రాకేష్ మాస్టర్ స్పందించాడు. జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్లు చేసిన రాకేష్ మాస్టర్ అక్కడ తిండి, ఇచ్చే గౌరవం ఎలా ఉంటాయో తెలిపాడు.

కిర్రాక్ ఆర్పి 100% నిజం…
కిర్రాక్ ఆర్పి ప్రధానంగా చేసిన ఆరోపణ జబర్దస్త్ లో తిండి బాగుండదని. ఇక దీనిపై రాకేష్ మాస్టర్ స్పందించాడు. అక్కడ ఫుడ్డు బాగుండదనే విషయం మొదట నాకు తెలియదు, భాస్కర్ నాకు ఫుడ్డు బయటి నుండి తెప్పించేవాడు. ఒకసారి ఆలస్యమయ్యే సరికి అందరితో పాటు తినడానికి వెళ్ళాను ఆ వడ్డించే తీరు బాగోలేదు, తిండి బాగోలేదు. కిర్రాక్ ఆర్పి చెప్పింది నిజమే ఈ విషయంలో అంటూ చెప్పారు. ఇక అక్కడ కంటెస్టెంట్లను పట్టించుకోరు, అమ్మాయిల పిచ్చి ఉన్న డైరెక్టర్ ఉన్నాడు అక్కడ శ్రీపాద వుమనైజర్ అంటూ కామెంట్స్ చేసారు.

అమ్మాయిలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అక్కడున్న మగ కమెడియన్స్ కి ఇవ్వరు. ఒక గౌరవం ఇవ్వరు కమెడియన్స్ కి అంటూ చెప్పాడు. ఇక సుధీర్, రష్మిల విషయంలో కిర్రాక్ ఆర్పి మాటలను తప్పుబట్టారు. వారికి నచ్చే చేస్తున్నారు ఎవరి బలవంతం మీదనో చేయడం లేదు అంటూ చెప్పాడు రాకేష్ మాస్టర్. బుల్లెట్ భాస్కర్ స్కిట్లలో దాదాపు పది స్కిట్లను చేసాడు రాకేష్ మాస్టర్.






























