Rakesh Master : సోషల్ మీడియాలో పుణ్యమా అని యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్ ఆ తరువాత జబర్దస్త్, ఈటీవీ ఈవెంట్లలో కనిపించాడు. ఢీ మొదటి సీజన్ తో మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో మళ్ళీ ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పి చేసిన విమర్శలను సమర్థిస్తూ రాకేష్ మాస్టర్ కిర్రాక్ ఆర్పి కి మద్దతు ఇచ్చాడు.

అలా చెప్పిన వాడిని చెప్పుతో కొట్టాలి…
మల్లెమాల సంస్థ తిండి విషయంలో బాగోలేదని, తిండి సరిగా పెట్టరని కిర్రాక్ ఆర్పి చేసిన వాఖ్యలను రాకేష్ మాస్టర్ సమర్థించాడు. కిర్రాక్ ఒక మాగాడిలా నిజాలను చెప్పాడని, చాలా మంది జబర్దస్త్ వాళ్ళు అక్కడున్న పరిస్థితులను చెప్పడానికి భయపడుతున్నారని, కానీ ఆర్పి మాత్రం అక్కడి విషయాలను నిర్భయంగా చెబుతున్నాడని అన్నారు. ఇక కిర్రాక్ ఆర్పి హోమ్ టూర్ ఫేక్ అని షేకింగ్ శేషు చేసిన వాఖ్యలకు స్పందిస్తూ కిర్రాక్ ఆర్పి ఒకవేళ అలా చేసుంటే అది తప్పని, అమ్మ పాత చీర చిరిగిన జాకెట్ తో ఉందని, పక్కింటి ఆమె మంచి పట్టు చీర లో ఉందని ఆమెను తల్లి అని పరిచయం చేసేవాడిని చెప్పుతో కొట్టాలి అంటూ పరుషంగా మాట్లాడారు.

అలాంటి వాళ్లను చంపకూడదు ట్రోల్ల్స్ కి వదిలేయాలి. నన్ను తిట్టకండి, నన్ను వదిలేయండి అంటూ అనే వరకు ట్రోల్ల్స్, మీమ్స్ తో చంపుతారు అంటూ వాఖ్యణించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ డిపార్టుమెంట్ లో వుమనైజర్స్ ఉన్నారంటూ మాట్లాడారు. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కేవలం వాళ్ళ మాటలు మాత్రమే వింటారంటూ విమర్శించారు. ఇక అనసూయ వెళ్ళిపోడానికి ఆమె సినిమాలలో బిజీ అవ్వడం కారణం అయ్యిండొచ్చు అయితే ఆమె వేరే ఛానెల్స్ లో కూడా షోలు చేస్తోంది జబర్దస్త్ లో కూడా ఇంకా పాత వాళ్లేనా కొత్త నీరు రావాలి కదా అంటూ వాఖ్యణించారు.


































