Rakesh Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు.

పెద్ధ బంగ్లా… మూడు కార్లు…
స్టార్ హీరోలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ 2000 సంవత్సరం సమయంలోనే 40 వేల రెంటు కడుతూ మూడు కార్లను మెయింటైన్ చేసాడు. అలాంటి స్టార్ డమ్ చూసిన రాకేష్ మాస్టర్ నేడు రెండు వేల రూపాయల రెంటు కట్టిన అద్దె ఇంట్లో ఉంటూ టిక్ టాక్ చేసుకునే వాళ్ళతో వీడియోలు చేసుకుంటూ తాగుడుకు బానిసగా మారి చివరికి ప్రాణం విడిచాడు.

ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన టాలెంట్ ను ఓర్వలేక ముక్కురాజు గురువు వద్ద ఆయన శిష్యులె చంపాలని చూసారని అప్పట్లో గొడవలు జరిగాయని చెప్పారు. అలాగే తనకు వర్క్ ఉన్నపుడు డాన్స్ నేర్చుకోడానికి ప్రభాస్ ఇంటికి వచ్చేవాడు అంటూ చెప్పారు. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి వంటి వారు పేకాట ఆడటానికి వచ్చేవారు అంటూ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ఒక లగ్జరీ లైఫ్ లో ఉన్న ఆయన తన చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్నారు.































