Rakhi Sawant: బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నటి,సింగర్ రాకీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ తన వింత చేష్టలతో వార్తలలో నిలిచే ఈమె పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నానని ప్రకటించారు.
ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చి ఏడాది కూడా తిరగకముందే ఈమె మరో పెళ్లి చేసుకున్నారు. ఈమె తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించే ఈమె తాజాగా అభిమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈమె రెండోసారి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న అనంతరం ముంబై రోడ్లపై కనిపించడంతో ఓ అభిమాని అతి ఉత్సాహం చూపిస్తూ తనతో సెల్ఫీ దిగడానికి ఆమె దగ్గరకు వెళ్లారు. ఇలా తనతో సెల్ఫీ అడిగితే వెంటనే రాఖీసావంత్ దూరం జరుగు బ్రదర్ నాకు పెళ్లయింది అంటూ ఆ అభిమాని పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశారు.
నన్ను ముట్టుకోవద్దు కాస్త దూరం జరుగు అప్పుడంటే ఓకే కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయింది అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లికాకముందు సెల్ఫీలు అంటే ఓకే కానీ పెళ్లి అయిన తర్వాత ఇలా సెల్ఫీలు తీసుకోవడం నాకు నచ్చలేదు అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్ లు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…