Rakshitha : రవితేజ ఇడియట్ అందులో సుచిత్ర… ఇంకెవరో కాదు రక్షిత. పూరీ జగన్నాథ్ సినిమా ఇడియట్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలతో తెలుగులో సినిమాలు చేసింది. నాగార్జున శివమణి, ఎన్టీఆర్ ఆంధ్రవాలా, చిరంజీవి అందరివాడు వంటి సినిమాలు చేసిన రక్షిత జగపతి బాబు వంటి హీరోల సరసన నటించింది. ఇక కన్నడ ఇండస్ట్రీ కి చెందిన రక్షిత అసలు పేరు శ్వేత. ఇండస్ట్రీ కి వచ్చాక రక్షితగా పేరు మార్చికుంది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఇడియట్ బ్యూటీ…
కన్నడ, తెలుగులో మంచి ఆఫర్స్ తో హీరోయిన్ గా కెరీర్ బాగా ఉన్నపుడు రక్షిత కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కొడుకు పుట్టాక బాగా లావై పోయిన రక్షిత కి థైరాయిడ్ సమస్య ఉందట. అందువల్లే తన శరీర బరువు పెరిగిపోయిందని పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయాల్లోకి వచ్చిన రక్షిత అటు మళ్ళీ టెలివిజన్ వైపు వచ్చారు.

కన్నడ టీవీ షోలలో జడ్జి గా పలు ప్రోగ్రామ్స్ కూడా చేసారు. అయితే అప్పటి యూత్ క్రేజ్ రక్షిత ను మాత్రం చాలా రోజుల తరువాత చూసిన ప్రేక్షకులు గుర్తుపట్టలేక పోతున్నారు, అలాగే కొంచెం షాక్ కూడా అవుతున్నారు. అయినా ఇడియట్ సినిమాలో డైలాగ్ ఉందిగా కమిషనర్ కూతుర్లకు పెళ్లిళ్లు కావా మొగుళ్ళు రారా అని అలా హీరోయిన్లు బొద్దుగా ఉండకూడదా ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ రక్షిత కు సపోర్ట్ చేస్తున్నారు.

































