Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వెంటనే ఆచార్య సినిమాతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో తొలిసారి కలిసి నటించినా ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఆ సినిమా గురించి మాట్లాడితే మెగా అభిమానులకు నిరాశ కోపం రెండు వస్తాయి. ఇక ఆ డిజాస్టర్ ని మర్చిపోయి శంకర్ తో రామ్ చరణ్ తీయబోతున్న సినిమాపై ఫోకస్ చేస్తున్నారు.

ముగ్గురు రామ్ చరణ్ లతో రిస్క్ చేస్తున్న శంకర్….
ఇక శంకర్ తో రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఎప్పటికప్పుడు షూటింగ్ విజువల్స్ లీక్ అవుతూ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతూ పోతున్నాయి. ఇంత వరకు ఈ సినిమాలో రెండు పాత్రలలో రామ్ చరణ్ కనిపిస్తున్నట్లు సమాచారం వచ్చింది. తండ్రి కొడుకుల పాత్రాలలో కనిపిస్తున్నట్లు పుకార్లు వినిపించాయి. ఇక రాజమండ్రి షూటింగ్ విజువల్స్ లీక్ అయి అందరూ ఒక్కో కథా అల్లేసుకున్నారు. ఇక ఇపుడు తాజాగా మరో గాసిప్ ఈ సినిమా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు పాత్రాలలో కనిపించనున్నాడట.

అందులో ఒకటి నెగెటివ్ పాత్ర అంటూ వినిపిస్తోంది. మన హీరోలు అంతకు ముందు త్రిపాత్రాభినయం చేసారు, చిరు ముగ్గురు మొనగాళ్లు, కృష్ణ రక్త సంబంధం అయితే అంత గొప్పగా సక్సెస్ అవ్వలేదు. ఇప్పటి హీరోల్లో ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం అందునా ఒకటి నెగెటివ్ రోల్ చేసాడు, సినిమా పర్వాలేదనిపించింది అయితే ఇపుడు రామ్ చరణ్ కూడా రిస్క్ చేస్తున్నాడానే చెప్పాలి మరి ఆ హీరోలు చేయలేనిది చెర్రీ చేయగలడా హిట్ కొట్టగలడా ఏమో వేచి చూడాల్సిందే మరి.

































