Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయనకి ఎంతో భక్తి భావం అనే సంగతి మనకు తెలిసిందే. తరుచూ ఆలయాలకు వెళ్లడం మనం చూస్తున్నాము. ఇకపోతే రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేయడం కూడా మనం చూస్తున్నాము. ఇక ఈ ఏడాది కూడా చరణ్ అయ్యప్ప మాల వేశారు.

ఇలా అయ్యప్ప మాల వేసిన ఈయన తాజాగా కడప పర్యటనకు వెళ్లారు.కడపలో ఈయన ముందుగా శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం అమీన్ పీర్ దర్గాకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈయన దర్గాని దర్శించుకున్నారు.
రామ్ చరణ్ దర్గాని దర్శించుకున్న అనంతరం గత మూడు నెలల కిందట ఏఆర్ రెహమాన్ గారు ఈ దర్గాని దర్శించమని నాకు చెప్పారు. ఆ క్షణమే నేను దర్గా రావాలనుకున్నాను. సుమారు 12 సంవత్సరాల క్రితం తాను ఈ దర్గాని దర్శించానని ఇప్పుడు మరోసారి దర్గాను దర్శించుకున్నానని చరణ్ తెలిపారు.

Ram Charan: ఏ.ఆర్ రెహమాన్ ..
ఇలా అయ్యప్ప మాల వేసుకుని రామ్ చరణ్ దర్గా వెళ్లడంతో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఏఆర్ రెహమాన్ దర్గా దర్శించమని చెప్పారు కాబట్టి మీరు వచ్చారు అదే మీరు తనని తిరుపతికి రమ్మని చెప్పండి వస్తారేమో అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరోవైపు అయ్యప్ప మాల వేసుకుని దర్గా వెళ్లడం ఏంటి ఇది మన హిందూ మతాన్ని అవమానించడమే అంటూ విభిన్న రకాలుగా ఈ విషయంపై కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.































