Ram Charan : మెగా అభిమానులు ఆనందంలో మునిగి తేలే మ్యాటర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నటనను, హావభావాలను మొదట్లో ట్రోల్ చేసిన వాళ్ళే ఇపుడు ప్రశంసిస్తూ ఉండటంతో ఆల్రడీ మెగా అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనను హాలీవుడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ సైతం పొగుడుతుంటే మరింత సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు జేమ్స్ బాండ్ కి చెర్రీ సూట్ అవుతాడంటే ఇక మెగా అభిమానులను ఆపగలమా…

జేమ్స్ బాండ్ గా చెర్రీ సూట్ అవుతాడు…
హాలీవుడ్ రైటర్ మార్వెల్ ‘ల్యూక్ కేజ్’ టెలివిజన్ సిరీస్ సృష్టికర్త చియో హోదరి కోకర్ జేమ్స్ బాండ్ పాత్రకు రామ చరణ్ చాలా బాగా సూట్ అవుతాడంటూ ట్వీట్ చేసాడు. ఇంకా కొంతమంది పేర్లను కూడా ఆయన పేర్కొన్నారు. ఇడ్రిస్ ఎల్బా, ‘గ్యాంగ్స్ ఆఫ్ లండన్’లో నటించిన సోపె డిరిసు, ‘ద ఆఫర్’ నటుడు మాథ్యూ జి, ‘స్నోఫాల్’ సిరీస్‌తో ఆకట్టుకున్న డామ్సన్ ఇడ్రిస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని రామ్ చరణ్.. జేమ్స్‌బాండ్ సూట్ వేసుకుని ‘వాల్థర్ పిపికె’ పిస్టల్‌తో కెమేరా ముందు యాక్షన్ చేస్తే బాగా ఆ పాత్రలో సూట్ అవుతారు” అని తన అభిప్రాయాన్ని చెప్పారు చియో హోదారీ కోకర్.

Damn! That escalated quickly. Everyone knows Idris from, well, everything, but to get inside my thinking, watch Sope in "Gangs Of London," Matthew G in "The Offer", Damson in "Snowfall" and Ram in "RRR". They all deserve a shot at a Savile Row suit and a Walther PPK. https://t.co/8ZGV4UFd9P
— Cheo Hodari Coker (@cheo_coker) July 27, 2022
Marvel's 'Luke Cage' creator thinks Ram Charan will be suitable for James Bond's role
— ANI Digital (@ani_digital) July 28, 2022
Read @ANI Story | https://t.co/X4AmYulkeS#Marvel #LukeCage #RamCharan #JamesBond pic.twitter.com/23ui7mNRgq
Bond!! John wick!! Capitan America!! Wolverine!! ????????????✌????
— Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) July 29, 2022
Western audiences wish to see #Ramcharan in a MARVEL Superhero role!! That's what they expressed after watching #RRRMovie, Global Star ❤????@AlwaysRamCharan pic.twitter.com/AKIAF9XMdX
కేవలం హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్ అన్ని సిరీస్ లను ప్రేక్షకులు ఆదరించారు. జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రాయిగ్ గతేడాది విడుదలైన ‘నో టైం టు డై’ సినిమా తరువాత ఇక జేమ్స్ బాండ్ పాత్రలో నటించనని రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో నెక్స్ట్ జేమ్స్ బాండ్ గా ఎవరు సూట్ అవుతారో అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ జేమ్స్ బాండ్ గా సూట్ అవుతాడనే వార్త ఇపుడు నేషనల్ మీడియాలోనూ ప్రముఖంగా వైరల్ అవ్వడం విశేషం. ఇక మెగా ఫ్యాన్స్ సంబరాలకు హద్ధుంటుందా.






























