Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవింద గోవింద, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల రంగీలా సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.
మొదట రంగీలా శ్రీదేవి… కానీ కథ నచ్చక పోవడంతో సీన్ లోకి ఊర్మిళ …
వర్మ కి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కోసం మాత్రమే వర్మ ‘క్షణక్షణం’ సినిమా తీసి అందులో శ్రీదేవి పాత్రను హైలైట్ చేసాడు. ఇక ఆమెను మరింత మోడరన్ గా అందంగా తన సినిమాలో చూపించాలనుకున్న వర్మ అప్పటికే తన వద్ద ఉన్న రెండు కథలను వినమని శ్రీదేవి కి చెప్పగా ‘రంగీలా’ సినిమా కథ అలాగే ‘గోవింద గోవింద’ కథ విన్నాక శ్రీదేవి రంగీల స్టోరీ నచ్చలేదు గోవింద గోవింద నచ్చింది అది చేద్దాం అని చెప్పిందట. వర్మ కూడా రంగీలా స్టోరీ తాను చేస్తే బాగుంటుంది అనుకున్నదే కానీ తానే చేయాలని అనుకోలేదట.
ఇక ఒకవేళ శ్రీదేవి ఒప్పుకొని ఉంటే అమీర్ ఖాన్ పాత్రకు నాగార్జున, జాకీ ష్రాఫ్ పాత్రలో రజనీకాంత్ ను అనుకున్నాడట వర్మ. అయితే శ్రీదేవి వద్దన్నాక ఆ సినిమా గురించి ఆలోచించడం మానేసాడట. ఇక అంతం సినిమా అయిపోయి గాయం సినిమా షూటింగ్ సమయంలో ఊర్మిళ కోరియోగ్రాఫర్ లేకపోయినా డాన్స్ చేయగలవా అని అడిగితే ట్రై చేస్తానని చెప్పడంతో అలా ఒక పాటకు తాను డాన్స్ చేయగా ఆ రోజు నైట్ డిసైడ్ అయ్యాను తానే నా రంగీలా సినిమాలో హీరోయిన్ ఇంకెవరూ చేయలేరు అని అంటూ వర్మ తెలిపారు. ఇక రంగీలా సినిమా సమయానికి ప్లాప్స్ లో ఉన్న ఊర్మిళ ఒక్కసారిగా ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిందంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…