Ram Gopal Varma comments on KGF2 director : రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా పోస్టులతో ఎవరిని విమర్శిస్తాడో ఎవరిని పొగుడుతాడో తెలీదు. కానీ ఏమి చేసిన వైరల్ మాత్రం అవుతాడు. అలా ఉంటాయి మరి ఆర్జీవి మాటలు. వివాదాలతో రోజు సహవాసం చేసే ఆర్జీవి లేటెస్ట్ గా హిందీ జాతీయ భాషా వివాదంలో తన వంతు పాత్ర పోషించాడు. భాష కాదని హీరోలు తమ సినిమాలతో పోటీ పడాలంటూ ఛాలెంజ్ చేసారు. అటు సౌత్ హీరోలు, ఇటు నార్త్ హీరోలు తమ. సినిమా హిట్లతో పోటీపడాలని సూచించారు.

ఇక తాజాగా ఆర్జీవి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ను తన శైలిలో ప్రశంసించి వైరల్ అయ్యాడు. కేజీఎఫ్ ఫ్రాంచైస్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అసలైన పాన్ ఇండియా సినిమాగా చరిత్ర సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమ స్టామినాను మొత్తం దేశానికి చాటిచెప్పింది కేజీఎఫ్ చాప్టర్ 1.
ప్రశాంత్ ను వీరప్పన్ తో పోల్చిన ఆర్జీవి….
ఇక ఆ తరువాత విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌ను ఇండియన్ సినిమా వీరప్పన్ అంటూ తన స్టైల్లో పొగిడారు. దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవి, ‘కేజీఎఫ్2’ సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని, వాళ్లు వృధా చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని అన్నారు. సినీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు తోసేసి , కొత్త పరిశ్రమకు జీవం పోసావు, దాని పేరే ‘కేజీఎఫ్ 2’ అని ప్రశంసించారు.

































