Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవిందా, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల తన పాత సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.

నా లైఫ్ లో వరస్ట్ ఫిల్మ్ అదే…
వర్మ ఇప్పుడు ఎలా తయారయ్యాడు కానీ ఒకప్పుడు మాత్రం మంచి టెక్నీషియన్. తాను సినిమా తీయడానికి ఎంచుకునే కథ దగ్గరినుండి తాను తీసుకునే టెక్నిషియన్స్ వరకు అన్ని చాలా వెరైటీ గా చేస్తూ ఇండియన్ సినిమాకు కొత్త టేస్ట్ చూపించాడు. అప్పట్లో వచ్చిన వర్మ సినిమాలన్నీ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అందరికీ నచ్చేవి. అయితే వర్మకు తన కెరీర్లో తీసిన సినిమాల్లో నచ్చని సినిమా ఉందంటూ చెప్పాడు. నాగార్జున, ఊర్మిళ నటించిన ‘అంతం’ సినిమా తన కెరీర్ లోనే వరస్ట్ సినిమా అంటూ వర్మ చెప్పాడు.

ఆ సినిమా చాలా మందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో మాత్రం నేను తీసుకున్న కంటెంట్ కి న్యాయం చేయలేదు అనిపించిన సినిమా అది అంటూ చెప్పాడు. ఎంతైనా వర్మ కదా ఉన్నది ఉన్నట్టు చెప్పసాడు. ఆంగ్ల నవల ఆధారంగా రూపొందిన ఈ నియో నోయిర్ క్రైమ్ కథను రూపొందించినపుడు పూర్తిగా నవలను ఉపయోగించుకోలేదని, అందుకే ఆ సినిమా నా కెరీర్ లో వరస్ట్ ఫిల్మ్ అంటూ వర్మ అభిప్రాయపడ్డారు.































